బెడిసి కొట్టిన కేసీఆర్ వ్యూహం..?

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన దగ్గరి నుంచి బీజేపీపై దూకుడు పెంచారు.దానికి తోడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దొరకడంతో.

 Kcr Strategy, Kcr, Brs Party, Telangana Politics, National Party , Minister Mall-TeluguStop.com

కేంద్రాన్ని ముప్పు తిప్పలు పెట్టాలని ప్లాన్ చేశారు.అనుకున్నదే తడవుగా.

సిట్ దర్యాప్తు పెట్టి దేశ వ్యాప్తంగా బీజేపీని బద్నాం చేయాలనుకున్నారు.అంతే కాకుండా ఇదే టైంలో సిట్ దర్యాప్తు కూడా దాదాపు పూర్తి కావడం.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.అంతా కలసి వస్తుందని ప్లాన్ చేసుకున్నారు.కానీ చివరి నిముషంలో హైకోర్టు కేసీఆర్ కు షాక్ ఇచ్చింది.

సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని.

అది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదంటూ నిందితులు హైకోర్టు ను ఆశ్రయించారు.దానిపై స్పందించిన హైకోర్టు సీబీఐకు బదిలీ చేయమని ఆదేశాలు జారీ చేసింది.

ఏసీబీకి తప్పా.సిట్ కు దర్యాప్తు చేసే అధికారం లేదన్న పిటీషనర్ వాదనతో ఏకీభవించిన దర్మాసనం.

ఈ తీర్పుని ఇచ్చింది.దాంతో కేసీఆర్ చేతిలో ఉన్న బలమైన ఆయుధం ఇప్పుడు కేంద్రం చేతిలోకి వెళ్లిపోయింది.

కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలోకి కేసు వస్తే.ఇక కేసీఆర్ ఆట కట్టించాలని చాలా కాలం నుంచి బీజేపీ భావిస్తోంది.

Telugu Brs, Malla, National, Telangana-Political

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో స్పీడ్ పెంచుతున్న కొద్దీ.సిట్ దర్యాప్తు వేగవంతం అవుతూ వచ్చింది.దాంతో కేసీఆర్ కూడా ఎలాంటి భయం లేకుండా ఉన్నారు.ఇప్పుడు కేసీఆర్ చేతిలోని ఆయుధం కేంద్రం చేతిలోకి వెళ్లిపోవడంతో. సుప్రీం కోర్టును ఆశ్రయించాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు.దానికి తోడు మంత్రి మల్లారెడ్డిని ఆదాయపు పన్ను శాఖ, మంత్రి గంగుల కమాలకర్ ను గ్రానైట్ కుంభకోణం పేరుతో టార్గెట్ చేసినా.

సిట్ ఆయుధం ఉండటంతో భయపడలేదు.మరి ఇప్పుడు బంతి సీబీఐ కోర్టులోకి వెల్లి పోవడంతో ఆయన ప్లాన్ బెడిసి కొట్టింది.

ఇక సుప్రీం కూడా సీబీఐ దర్యాప్తుకే జై కొడితే.కేసీఆర్ ప్లాన్ బెడిసి కొట్టినట్టే అవుతుంది.

మరి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును పక్కన పెట్టి కొత్త ఎజెండా తీసుకుంటారా.? లేక దానిపైనే పోరాడి గెలుస్తారా చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube