వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ గెలుపు పై ధీమా తోనే ఉన్నారు.2024 లోను 2019 ఎన్నికల తరహా ఫలితాలు వెలువడతాయని జగన్ నమ్ముతున్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయని జగన్ భావిస్తున్నారు.ఎమ్మెల్యేల పై వ్యతిరేకత లేకుండా చేసేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
ఏ విషయంలోనూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు.గతంలో ఏ ప్రభుత్వం ఇంత స్వల్ప సమయంలో చేపట్టలేని అభివృద్ధి సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వమే అమలు చేసిందని జగన్ గొప్పగా చెబుతున్నారు.
అయితే కొన్ని కొన్ని విషయాల్లో ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నా, అది సద్వినియోగం చేసుకుని తమ గెలుపునకు బాటలు వేసుకునే పరిస్థితుల్లో జనసేన , టిడిపిలు లేవనే విషయాన్ని జగన్ బలంగా నమ్ముతున్నారు . ప్రధానంగా విశ్వసనీయత అనేది తమకు మాత్రమే సొంతం అనేది జగన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.జగన్ మాట ఇస్తే అది కచ్చితంగా అమలు చేస్తారని జనాలు నమ్ముతున్నారని, దీనికి తగ్గట్లుగానే 2019 ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో తాను ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని, కానీ చంద్రబాబు ఈ విషయంలో ఇప్పటికీ వెనకబడే ఉన్నారని, గతంలో ఆయన ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవని , అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన జనాలకు నమ్మకం లేదని, ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడుతారో.తర్వాత దానిని పట్టించుకోకుండా ఎలా వదిలేస్తారు అనేది జనాలకు బాగా తెలుసునని జగన్ భావిస్తున్నారు.

ఇక తాము రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో చేసిన పొరపాట్లు అన్నిటిని సరిదిద్దుకుంటూ, తమ రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం దక్కకుండా చేయాలని భావిస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో విశ్వసనీయత, చిత్తశుద్ధిని నమ్మే తమకు జనాలు ఓట్లు వేస్తారని ఈ విషయంలో టిడిపి ,జనసేన బిజెపి పార్టీలు ఈ తరహా చిత్తశుద్ధి , విశ్వసనీయతను జనాల్లో కోల్పోయాయనే విషయాన్ని బలంగా నమ్ముతున్నారు.అందుకే గెలుపు పై ఇంత ధీమా గా జగన్ ఉన్నట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.







