అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన జరిగింది.మదనపల్లెలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు.
కొందరు గుర్తు తెలియని దుండగులు వ్యక్తి తల నరికి చంపారు.బైకుపై వెళ్తుండగా కళ్లలో కారం చల్లి హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతుని తల భాగం కోసం గాలిస్తున్నారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
అటు మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.







