యూఎస్ లో 'ధమాకా' చేస్తున్న మాస్ రాజా.. స్ట్రాంగ్ వసూళ్లతో..

మాస్ మహారాజా రవితేజ సినిమాలు అంటే కామెడీ అండ్ ఎనెర్జటిక్ గా ఉంటాయి అని ఫ్యాన్స్ ఆశిస్తారు.అయితే గత రెండు సినిమాలు మాస్ రాజా ఫ్యాన్స్ ను బాగా నిరాశ పరిచాయి.

 Dhamaka Usa Box Office Collections Details, Ravi Teja, Dhamaka Movie, Sreeleela,-TeluguStop.com

ఎన్నో రోజుల తర్వాత క్రాక్ సినిమాతో అందుకున్న విజయం ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో మరోసారి ప్లాప్ లు అందుకుని నిరాశ పరిచాడు.

అయితే ఈయన మొన్న శుక్రవారం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ధమాకా’. భారీ అంచనాలతో ధమాకా సినిమా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాలో పెళ్ళి సందడి బ్యూటీ శ్రీలీల రవితేజకు జోడీగా నటించింది.

క్రిస్మస్ బరిలో దిగిన ఈ సినిమాను వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించగా.భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన రవితేజ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ధమాకా యూనిట్ మొత్తం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన అన్ని చోట్ల ఒకే రెస్పాన్స్ అందుకోవడంతో కలెక్షన్స్ లో కూడా కుమ్మేస్తుంది.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ధమాకా సినిమా యూఎస్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది.ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా యూఎస్ లో భారీ వసూళ్లు సాదిస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో ప్రీమియర్స్ తో సహా రెండు రోజుల్లోనే 50 వేల డాలర్స్ కి పైగానే వసూళ్లు అందుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

దీంతో యూఎస్ లో కూడా మాస్ రాజా హవా సాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube