తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం ఈమె సౌత్ లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే.
పెళ్లి అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
ఇకపోతే ఈమె కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.పెళ్లికి ముందే కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇటీవలే వైవాహిక బంధంతో ఒకటయ్యారు.
అంతే కాకుండా ఈ దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.ఇకపోతే నయనతార సినిమా ప్రమోషన్స్ కి రావడం అన్నది చాలా అరుదు అని చెప్పవచ్చు.
కానీ ఈమె తాజాగా నటించిన కనెక్ట్ సినిమా కోసం ఇంటర్వ్యూ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.అంతేకాకుండా తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి కనెక్ట్ ప్రీమియర్ షోలో కూడా పాల్గొంది నయనతార.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఆ ఫొటోస్ పై పలువురు నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూ అసభ్యంగా కామెంట్స్ చేశారు.

పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా ఇంకా అలాగే ఉంది ఏంటి అంటూ కామెంట్స్ చేయడంతో పాటు నయనతార బాడీ షేప్స్ గురించి కూడా నోటికి వచ్చిన విధంగా అసభ్య పదజాలంతో కామెంట్స్ చేశారు.అయితే నయనతార బాడీ షేప్స్ పై వచ్చిన కామెంట్స్ పై సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇలాంటి పురుషులు ఇంట్లో ఉంటే మహిళలు వారి కన్నబిడ్డలకు కూడా చున్నీ వేసే తిప్పాలేమో.ఎందుకంటే పురుషుడు అతడి ఫీలింగ్స్ ఆపుకోలేడు కదా.తండ్రైనా, సోదరుడైనా ఇంట్లో ఆడపిల్లను కూడా అలాంటి దుర్బుద్ధితోనే చూస్తాడేమో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి. మహిళలందరూ తమ ఆడపిల్లలను ఇలాంటి పురుషులకు దూరంగా ఉంచాలని, వాళ్ల వల్ల ఎటువంటి సంరక్షణ ఉండదని మండిపడింది చిన్మయి చేసిన వ్యాఖ్యల పై పలువురి నెటిజన్స్ స్పందిస్తూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.







