సీనియర్ల కు సీన్ అర్థమయ్యిందిగా .. ఇప్పుడేంటి పరిస్థితి ? 

తెలంగాణ కాంగ్రెస్ రెండుగా విడిపోయింది.సీనియర్లు, జూనియర్లు అనే చీలిక వచ్చింది.

 Telangana Congress Leaders Situation After Digvijay Singh Visit Details, Telanga-TeluguStop.com

సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లను ప్రోత్సహించే విధంగా ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకోవడం,  తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి వ్యవహారాలతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా అసంతృప్తికి గురై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకున్నారు. తాము ఎన్ని చెప్పినా రేవంత్ వర్గానికి అధిష్టానం పెద్దపేట వేస్తుండడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి చెందారు.

ఓ క్రమంలో పార్టీ మారేందుకు కూడా వెనకాడబోము అనే సంకేతాలను ఇచ్చారు.దీంతో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించింది.
  ఆయన రాకతో రేవంత్ వర్గానికి చెక్ పడుతుందని , తమ మాట చెల్లుబాటు అవుతుందని సీనియర్లు భావించారు.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి తో పాటు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ పైన తాము ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో, వారిద్దరిలో ఒకరిని పదవి నుంచి తప్పిస్తారని సీనియర్లు ఆశలు పెట్టుకోగా,  దిగ్విజయ్ సింగ్ మాత్రం వారి విషయంలో సైలెంట్ గా ఉండడమే కాకుండా,  తమకే వార్నింగ్ ఇవ్వడంపై వీరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.దిగ్విజయ్ సింగ్ వచ్చినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించకపోగా,  తమకు వార్నింగ్ ఇవ్వడం తో ఇక తమ మాట అధిష్టానం వద్ద చెల్లుబాటు కాదనే నిర్ణయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చేసారు.

Telugu Aicc, Congress, Digvijay Singh, Manikyam Tagore, Pcc, Rahul Gandhi, Revan

ఇప్పటికే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ గాంధీభవన్ లో ఏఐసిసి పెద్దలను కలవబోవునని చెప్పేశారు.ఇప్పుడు సీనియర్లు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.మూకమ్మడిగా ఏదైనా పార్టీలో చేరుతారా ? కాంగ్రెస్ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకుండా తమ నిరసనను తెలియజేస్తారా అనేది తేలాల్సి ఉంది.వీరి వ్యవహారం ఇలా ఉంటే,  రేవంత్ రెడ్డి మాత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర తో పాటు , కాంగ్రెస్ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ముందుగా అనుకున్న ప్లాన్ లను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని డిసైడ్ అయిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube