గర్భం దాల్చడం వల్లే పెళ్లి చేసుకున్నావంటూ ట్రోల్స్.. హీరోయిన్ ఏమన్నారంటే?

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల గురించి ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయనే సంగతి తెలిసిందే.ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఒకరైన దేవలీనా కోడలా కోడలా కొడుకు పెళ్లామా సీరియల్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.

 Devoleena Bhattacharjee They Cant See Anyone Happy Details Here Goes Viral , Kod-TeluguStop.com

అయితే ఈ నటి పెళ్లి కాకుండానే తల్లైందంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపించాయి.ఈ వార్తలను ఫ్యాన్స్ కూడా నిజమేనని నమ్మారు.

మరోవైపు గర్భం దాల్చడం వల్లే పెళ్లి చేసుకున్నావంటూ ఈ నటిపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.ఈ ట్రోల్స్ తన దృష్టికి రావడంతో ఈ నటి ఒకింత ఘాటుగా స్పందించారు.

నటి దేవలీనా తనపై వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.తనపై వస్తున్న విమర్శల గురించి నేను ఇతరులకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదని ఆమె కామెంట్లు చేశారు.

గర్భం దాల్చడం వల్లే పెళ్లి చేసుకున్నానని జరుగుతున్న ప్రచారం బాధ పెడుతోందని ఆమె తెలిపారు.

ఒక మహిళ గురించి ఇంత దారుణంగా కామెంట్లు చేస్తారా అని అనిపించిందని ఆమె అన్నారు.

ఇతరుల సంతోషాన్ని నాశనం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని వైరల్ అవుతున్న వార్తల ద్వారా అర్థమైందని దేవలీనా వెల్లడించారు.ఈ తరహా ప్రచారం జరగడం వల్ల కోపం, బాధ రెండూ వస్తాయని ఆమె తెలిపారు.

సంతోషంగా ఉన్న ఒకరి లైఫ్ ను నాశనం చేయడానికి మనసెలా ఒప్పుతుందని ఆమె ప్రశ్నించారు.

ఈ తరహా కామెంట్ల గురించి నేను పెద్దగా పట్టించుకోనని దేవలీనా అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ నెల 14వ తేదీన షాన్వద్ శేఖ్ అనే వ్యక్తిని దేవలీనా పెళ్లి చేసుకోవడంతో ఈ తరహా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.దేవలీనా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube