ఆఫర్ అదుర్స్: ఫ్లైట్​ క్యాన్సిల్​ అయితే రూ.10వేలు... అలా చేస్తే రూ.20వేలు?

మీలో కొంతమందికి విమాన ప్రయాణం చేసే అనుభవం వుండే ఉంటుంది.ఒకవేళ లేకపోయినా కొన్ని విషయాలు అనేవి తెలుసుకుంటే ఉత్తమం.

 Dgca Announced Refunds And Compensations For Flight Passangers Details, Flight,-TeluguStop.com

విమానయాన సంస్థలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) త్వరలోనే కొన్ని నిబంధనలు అమలు చేసే దిశగా అడుగులు వేయనుంది.అవేమంటే విమానయాన సంస్థలు అనేవి మీ వద్ద టికెట్ ఉండి కూడా బోర్డింగ్ సమయంలో ఫ్లైట్ ఎక్కించుకోకపోతే, మీకు రూ.20 వేలు నష్ట పరిహారం, ఒకవేళ ఫ్లైట్ రద్దయిన యెడల పాసింజర్లకు సంబంధిత ఎయిర్​లైన్స్​ రూ.10వేల వరకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

ఈమేరకు DGCA ఈ సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది.కాగా వచ్చే కొత్త ఏడాదితో ఈ రూల్స్ అమలవుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.విమానయాన సంస్థ తమ విమానాన్ని రద్దు చేయాలని భావిస్తే.2 వారాల ముందుగానే ప్యాసింజర్లకు తెలిపి ప్రత్యామ్నాయ ఫ్లైట్​ను ఏర్పాటు చేయాలి అలాగే ప్రయాణానికి ఒక రోజు లేదా 2 వారాల లోపు ఫైట్​ రద్దు చేస్తే.ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలి లేదా టికెట్​ సొమ్మును తిరిగి పూర్తిగా చెల్లించాలి.

Telugu Thousand, Cancelled, Dgca, Passangers, Ticket, Refunds, Latest-Latest New

ఒకవేళ 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో ఎయిర్‌లైన్ సంస్థ విమానాన్ని రద్దు చేస్తే మాత్రం ప్యాసింజర్లకు అత్యధికంగా రూ.10 వేల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఫ్లైట్​లో ఓవర్ ​బుకింగ్​ జరిగితే.

సంబంధిత ఎయిర్​లైన్స్​ సంస్థ ప్రయాణికులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి లేదంటే బోర్డింగ్​కు నిరాకరిస్తే.గంటలోపు వేరే ఫ్లైట్​ను ఏర్పాటు చేయాలి కాదనుకుంటే రూ.20 వేల వరకు పరిహారం చెల్లించాలి.కాబట్టి విలువైన ఈ సమాచారాన్ని ప్రయాణికులు గుర్తుపెట్టుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube