సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన హారర్ త్రిల్లర్ మూవీ కనెక్ట్.అశ్విన్ శరవనన్ దర్శకత్వంలో నయనతార భర్త విగ్నేష్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక తెలుగులో ఈ చిత్రాన్న యు వి క్రియేషన్స్ విడుదల చేశారు.ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇదివరకే ఇలాంటి హర్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న నయనతార మరోసారి కనెక్ట్ మూవీ ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న రెండు రోజులలోనే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ని కూడా ఫిక్స్ చేసుకుంది.
ఈ క్రమంలోనే కనెక్ట్ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంచి ధరలకు కొనుగోలు చేసిన్నట్టు సమాచారం.ఇక ప్రస్తుతం ఈ సినిమా చాలా సక్సెస్ ఫుల్ గా థియేటర్లో రన్ అవుతుంది .ఈ సినిమా థియేటర్స్ పూర్తికాగానే నెట్ ఫ్లిక్స్ లో కనెక్ట్ ప్రసారం కానుంది.త్వరలోనే ఇందుకు సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇకపోతే నయనతార ఇదివరకు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన కూడా ఈమె సినిమా ప్రపోషన్లకు మాత్రం హాజరు కాలేదు.అయితే మొదటిసారి సొంత నిర్మాణంలో కనెక్ట్ సినిమా తెరకెక్కిన నేపథ్యంలో నయనతార సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈమె ఇన్ని రోజులు సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.సినిమా ప్రమోషన్లలో హీరోయిన్లకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని వారిని ఒక మూల నిల్చో పెడతారు.
అందుకే తాను ప్రమోషన్లకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.ఇలా ప్రమోషన్ల విషయంలో నయనతార చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







