రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.ఉదయం 8 గంటలకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ స్టార్ట్ అయింది.
జిల్లాలో 13 మండలాల్లో 15 డైరెక్టర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.అటు మంత్రి కేటీఆర్, ఇటు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో సెస్ ఎన్నికలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి.
కాగా ఈ ఎన్నికలకు 202 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.సెస్ ఎన్నికల బరిలో 75 మంది అభ్యర్థులున్నారు.ఈ ఎన్నికల్లో 87,130 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.202 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 252 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు అధికారులు.750 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా 15 మంది రూట్ ఆఫీసర్లు, 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.







