కాంతారా కి సీక్వెల్ అనౌన్స్ చేసాక చాల మంది కథ ఎలా ఉండబోతుంది అనే ఆలోచనలో పడ్డారు.ఎందుకంటే కాంతారా సినిమాలో శివ పాత్రా తండ్రి లాగ భూతకోలా చేస్తూ అడవిలోకి వెళ్లి మాయం అయ్యాడు.
తండ్రి రాలేదు కొడుకు రాకూడదు.సో సీక్వెల్ ఎలా ఉంటుందో అనే సందేహాల్లో అందరు ఉండగానే కాంతారా సినిమా ప్రొడ్యూసర్ విజయ్ సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ అనే మాట అన్నారు.
అంటే శివ తండ్రి దగ్గర సినిమా కథ ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.అయితే ఈ ప్రీక్వెల్ మాట ఇప్పుడు ఇండస్ట్రీ ని కుదింపు చేస్తుంది.
ఎందుకంటే మన ఇండియన్ సినిమాలో ప్రీక్వెల్స్ చాల అరుదు.అందుకే ఇంకా ఎదో ఒకటి విజయ్ మరియు రిషబ్ తేల్చుకుంటారు.అయితే ఈ ప్రీక్వెల్ మాట రాగానే సంవత్సన్నరం క్రితం బాహుబలి కి ప్రీక్వెల్ అని బాగా విన్నాం కదా.అంటే రమ్య కృష్ణ, బిజ్జల దేవుడు యువకులుగా ఉన్నప్పటి నుంచి, అంటే యంగ్ శివగామి గా కథ ఉండాలి.అయితే ఈ కథ అనుకున్నట్టే తీయాలని మొదలు పెట్టిన రాసింది మాత్రం విజయేంద్ర ప్రసాద్ కాదు.
ఆనంద్ నీలకంఠన్.ఇక నెట్ ఫ్లిక్స్ కోసం ఇది సిరీస్ గా చేయాలి.మొదట శివ గామి పాత్రా కోసం మృణాల్ ఠాకూర్ అనుక్కున్నారు.
అప్పటికి సీతారామం ఆలోచన కూడా లేదు.ఇంకా చాల మందిని అనుకున్న ఆమెను ఫైనల్ చేసి కొంత మేర షూట్ చేసిన తర్వాత నెట్ ఫ్లిక్స్ వాళ్ళు అస్సలు బాగోలేదని పక్కన పడేసి మరొక టీమ్ కి ఇది ఇచ్చారు.
అప్పుడే ఆర్కా మీడియా మరియు వన్ స్టూడియో కూడా ఇన్వాల్వ్ అయ్యాయి.
ఇక హీరోయిన్ గా సమంత ని అడగ్గా ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట.ఎందుకంటే బాహుబలి ప్రీక్వెల్ లో నటించాలంటే అందరు రమ్య కృష్ణ తోనే పోల్చుతారు అని ఆమె భయపడచ్చు.కానీ అంత సీరియస్ గా ఉన్నప్పటికీ ఆ పాత్రలో సమంత నటించి ఉంటె బాగుండు అనిపించింది.
మరో వైపు ఈ టైం లో ప్రీక్వెల్ ని రిజెక్ట్ చేసి ఆమె ఫ్యామిలీ మ్యాన్ కోసం రాజి గా మారి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.ఆలా బాహుబలి అటక ఎక్కింది.
మరి కాంతారా భవిష్యత్తు ఏంటో చూడాలి.