సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఏడాదిలో ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.కొన్ని సినిమాలు విడుదల అయ్యి మంచి కలెక్షన్స్ను సాధిస్తే మరికొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలుస్తూ ఉంటాయి.
మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ లను చవి చూస్తూ ఉంటాయి.ఇక ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.
చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియాలో సినిమాల వరకు ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి.అయితే చిన్న సినిమాలు గా విడుదలైన కొన్ని సినిమాలు ఊహించిన విధంగా భారీగా కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి.
మరి కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్లుగా నిలిచాయి.మరి కొన్ని సినిమాలకు పరవాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ వచ్చాయి.
అయితే ఈ ఏడాది చాలావరకు అభిమానులకు నిరాశపరిచే విధంగా సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి అని చెప్పవచ్చు.ఇకఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2, బింబిసారా, సీతారామం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలవడంతో పాటు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది అనగా 2022లో భారీ అంచనాల నడుమ విడుదల అయి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో రాధేశ్యామ్ సినిమా కూడా ఒకటి.

ప్రభాస్,పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ సినిమా 500 నుంచి 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబడుతుందని అంచనా వేశారు.కానీ ఆ అంచనాలను తిప్పికొడుతూ ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ చూసింది.
కనీసం పెట్టుబడికి తగ్గట్టుగా కూడా కలెక్షన్స్ను సాధించలేకపోయింది.అంతేకాకుండా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో రాధేశ్యామ్ సినిమా ముందు ఉంటుంది అని చెప్పవచ్చు.







