విశాఖలోని రుషికొండ అక్రమ తవ్వకాలపై ఇవాళ ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది.ఈ మేరకు నిన్న జరిగిన విచారణలో న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కంటి తుడుపుగా కమిటీ వేశారంటూ కేంద్రంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం… తవ్వకాలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిటీని తామే నియమిస్తామని తెలిపింది.అదేవిధంగా కమిటీలో ఏపీ అధికారులకు చోటు ఎలా కల్పిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో కమిటీ తీర్పుపై తాము సంతృప్తిగా లేమని చెప్పింది.కేంద్ర కమిటీపై అభ్యంతరాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.







