ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ కు నామినేట్ కావడం ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కల అనే సంగతి తెలిసిందే.ఈ ఇద్దరు హీరోల నాలుగేళ్ల కష్టానికి ఆర్ఆర్ఆర్ మూవీ రూపంలో ఫలితం దక్కింది.
ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించగా తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు చరణ్, ఎన్టీఆర్ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి ఈ సినిమా చూసిన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావాలని జక్కన్న ఎంతో కష్టపడుతున్న సంగతి తెలిసిందే.
ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కావడం హాట్ టాపిక్ అవుతోంది.
ఒక కేటగిరీలో ఆస్కార్ కు నాటు నాటు సాంగ్ నామినేట్ కావడం అంటే సినీ ప్రియులకు, మ్యూజిక్ లవర్స్ కు ఈ వార్త అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి.
విదేశీ ప్రేక్షకులకు సైతం ఆర్ఆర్ఆర్ మూవీ, ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ సన్నివేశాలు తెగ నచ్చేశాయి.హాలీవుడ్ సినిమాలను తలపించేలా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించడం ఈ సినిమా సక్సెస్ కు కారణమైందని కొంతమంది భావిస్తారు.2023 సంవత్సరం మార్చి నెల 12వ తేదీన హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో ఈ అవార్డుల పంపిణీ జరగనుందని సమాచారం.

ఈ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.మొత్తం 15 పాటలు ఈ కేటగిరీలో పోటీ పడుతుండగా నాటునాటు సాంగ్ ఆస్కార్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయనే చెప్పాలి.ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.ఆర్ఆర్ఆర్ విడుదలై తొమ్మిది నెలలైనా ఈ సినిమా గురించి ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది.







