సోషల్ మీడియా ప్రభావం జనాలమీద ఏ విధంగా వుందో చెప్పాల్సిన పనిలేదు.నేది ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరడంతో ప్రపంచంలో ఎక్కడ జరిగిన విషయాలన్నా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న కంటెంట్ ద్వారా అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాం.చాలా వీడియోలు అనునిత్యం ఇక్కడ వైరల్ అవుతుండటం మనం చూస్తూ వున్నాం.
ఈ క్రమంలోనే తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో ఓ ప్రయాణికుడు వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.
ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా సదరు వీడియో వైరల్ అవుతోంది.సదరు వీడియోలో ఎయిర్ హోస్టెస్‌కు, ప్రయాణికుడికి మధ్య జరిగిన వాగ్వాదం చూడవచ్చు.విషయం ఏమంటే, ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో ఫ్లైట్ లో ఆహారం విషయమై ఇద్దరి మధ్య వివాదం జరిగింది.ఎక్కువగా ఆప్షన్స్ ఇవ్వలేదని, లిమిటెడ్‌గా పెట్టారని ప్రయాణికుడు గొవడకు దిగడం కొసమెరుపు.అయితే… దీనిపై ఇండిగో సంస్థ యాజమాన్యం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదట.

దాంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇండిగో సిబ్బందిని తీవ్రస్థాయిలో విమర్శిస్తుండగా, మరి కొందరు మాత్రం వాళ్లకు సపోర్ట్ చేయడం కొసమెరుపు.డిసెంబర్ 19న ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ కావడం గమనించవచ్చు.“ఇండిగోలో టికెట్ బుక్ చేసుకుని పెద్ద తప్పు చేశాను” అని గురుప్రీత్ సింగ్ అనే యూజర్ ట్వీట్ చేశారు.అతను ట్వీట్ చేస్తూ “ప్రతి ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఫుడ్ చాయిస్ అనేది ఉంటుంది.కొందరు ఈ విషయంలో కాంప్రమైజ్ అవుతారు.కొందరు అలా కన్విన్స్ అవ్వలేరు… దానికి ఉదాహరణే ఇది” అని ట్వీట్ చేశారు.“ఇండిగో సిబ్బంది ప్రయాణికుడితో ఎలా ప్రవర్తించిందో.ప్రయాణికుడు ఆ అమ్మాయితో ఎలా బిహేవ్ చేశాడో నేను కళ్లారా చూశాను” అని కామెంట్ కూడా చేశాడు.







