అపరిచితులెవరైనా ఒక్క కాల్ మాట్లాడాలి అంటూ ఫోన్ అడిగితే గుడ్డిగా నమ్మకండి... ఇలాంటివి జరగొచ్చు!

మంచికి పోతే చెడు ఎదురవడం అనే నానుడి గురించి వినే వుంటారు.ఈ విషయం చాలామంది విషయంలో జరిగే ఉంటుంది.

 Dont Give Your Mobile To Strangers For Doing A Call Otherwise You Will Be A Vict-TeluguStop.com

అందుకే ఈ కాలంలో ఎదుటివారిని నమ్మడానికి లేదు.కాబట్టి ఇలాంటి విషయాలలో కాస్త ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం.

ఎందుకంటే, నేడు దేశంలో ఎక్కడో ఒకచోట పూటకొక కొత్త స్కామ్ జరిగి సామాన్యులు తీవ్రస్థాయిలో నష్టపోతున్న ఘటనలు మనం చూస్తూ వున్నాం.ఈ క్రమంలోనే తాజాగా మరొక కొత్త స్కామ్ బయటపడింది.

ఈ అనుభవం మీకు కూడా జరిగే ఉంటుంది.

ఎపుడో ఒకప్పుడు “చాలా అర్జెంటుగా కాల్ చేసుకోవాలి… నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను… మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? ఒకే ఒక్క కాల్!” అని అడిగారా? అడిగే వుంటారు కదూ.అలాంటప్పుడు ఫోన్ ఇవ్వకుండా ఉండలేం.అయితే అందరూ కాదు గాని, కొంతమంది కేటుగాళ్లు ఈ విషయాన్నే క్యాష్ చేసుకోవడం మొదలు పెట్టారు.

అవును, అలా అడిగి ఫోన్ తీసుకొని అకౌంట్ ఖాళీ చేసేస్తున్నారు.ఏంటి? ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది పచ్చి నిజం.వారు ఆ సమయంలో జెస్ట్ ఒక నంబర్ కు డయల్ చేస్తారు.ఇక అంతే, పని జరిగిపోతుంది.

విషయం తెలియని మనం మోసపోతూ ఉంటాం.అందుకే, ఇటువంటి స్కామర్ల నుండి జాగ్రత్తగా ఉండండి అంటూ సైబర్ పోలీసులు పదేపదే జనాలను అలెర్ట్ చేస్తున్నారు.దీనినే ఇపుడు Call Scam అని పిలుస్తున్నారు.ఈ ప్రక్రియలో స్కామర్లు మీ ఫోన్ తీసుకొని వెంటనే *21* లేదా *401* కి కాల్ చేస్తారు.దాంతో మీ ఫోన్ కాల్స్ మరియు మెసేజీలు వారి నంబర్ కి ఫార్వార్డ్ అవుతూ వుంటాయి.పైన తెలిపి విధంగా మీ ఫోన్ మెసేజీలు మరియు కాల్స్ ఫార్వార్డ్ చేస్తే, మీ ఇంపార్టెంట్ మెసేజీలు (OTP లాంటివి) మరియు కాల్స్ మరిన్ని వివరాలు స్కామర్ల చేతిలోకి వెళ్లిపోతాయి.

ఇంకేముంది కట్ చేస్తే మీ ఖాతా ఖాళీ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube