మహేష్‌, త్రివిక్రమ్‌ మూవీ 60 రోజులు ఏకధాటిగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలకు గత కొన్ని నెలలుగా ఏదో ఒక అడ్డు తలుగుతూనే ఉంది.కరోనా కారణంగా దాదాపు ఏడాది ఆలస్యంగా ప్రారంభం అయిన సినిమా షూటింగ్ మొదలైన వెంటనే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందిన విషయం తెలిసిందే.

 Mahesh Babu And Trivikram Movie Shooting , Trivikram Movie, Mahesh Babu, Flim Ne-TeluguStop.com

రెండవ షెడ్యూల్ ప్రారంభం చేయాలనుకుంటున్న సమయంలో కృష్ణ మృతి చెందారు.తల్లిదండ్రి మృతి తో మహేష్ బాబు తీవ్ర ఆవేదనలో ఉన్నాడు.

ఈ సమయం లో ఆయన షూటింగ్ కి హాజరు కాక పోవచ్చని అంతా భావించారు.అనుకున్నట్లుగానే ఇప్పటి వరకు సినిమా చిత్రీకరణ ప్రారంభించలేదు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో సినిమా యొక్క చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది.

ఏక ధాటిగా 60 రోజుల పాటు చిత్రీకరణలో మహేష్ బాబు పాల్గొంటారని తెలుస్తుంది.దాంతో సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలు మరియు పాటల చిత్రీకరణ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అవుతుంది.ఆ తర్వాత ఒక షెడ్యూల్ తో రెండు నుండి మూడు వారాల పాటు చిత్రీకరణ చేసి మొత్తం సినిమా ను పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఈ సినిమా లో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.ఆమె డేట్స్ ఈ నెల లో ఖాళీ లేని కారణంగా షూటింగ్ వాయిదా వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం పుష్కర కాలం గా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube