త్వరలో ట్విట్టర్ సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎలాన్ మాస్క్.. ఎందుకంటే

ట్విట్టర్ను తను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎన్నో రకాల మార్పులను ఎలాన్ మాస్క్ చేస్తూ వస్తున్నాడు.ఈ క్రమంలోనే మాస్క్ ఎన్నో రకాల విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు.

 Majority Vote For Elon Musk To Quit As Twitter Ceo Details, Elon Musk , Twitter-TeluguStop.com

తాజాగా ఎలాన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు.త్వరలో ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు.

ట్విట్టర్ ఫోల్ లో నెటిజన్లు ఇచ్చిన తీర్పుతో ఎలాన్ మాస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వేరే వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించాలని ఆ తర్వాత నేను పదవి నుంచి తప్పుకుంటానని  మాస్క్ చెప్పాడు.

ఆ తర్వాత సాఫ్ట్వేర్ అండ్ సర్వర్ల బృందాలను నడుపుతానున్నట్టు ట్విట్టర్లో ఎలాన్ వెల్లడించాడు.

ట్విట్టర్  కొన్న తర్వాత ఎలా మాస్క్ చాలా వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాడు.

దీనివల్ల మాస్క్ తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి.ఈ క్రమంలో ట్విట్టర్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా పోల్ నిర్వహిస్తానని మాస్క్ చెబుతున్నాడు.

రెండు రోజుల క్రితం మాస్క్ ఒక ఆసక్తికరమైన పోల్ ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.తను ట్విట్టర్ అధిపతిగా కొనసాగాలా వద్దా అనే విషయంపై ఓటు చేయాలని నేటిజనులకు సూచించాడు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల 50 నిమిషములకు మాస్క్ ఈ పోస్ట్ పెట్టాడు.ఈ ఫోల్ లో 57 శాతం మంది నేటిజెన్లు ఎలాన్ మాస్క్ కు ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి తప్పుకోవాలని ఓటు వేయగా, 43 శాతం మంది మాత్రమే వద్దు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.దీనివల్ల ఎలాన్ మాస్క్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.తను ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి త్వరలో తప్పుకుంటున్నట్లు ఎలాన్ మాస్క్ ట్వీట్ చేశాడు.చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి కొత్త వ్యక్తిని నియమించి ఆ తర్వాత ఈ పదవ నుంచి తను తప్పుకుంటానని స్పష్టం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube