బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 ముగియడంతో ఇప్పటినుంచి బిగ్ బాస్ సీజన్7 గురించి చర్చలు జరుగుతున్నాయి.వరుసగా నాలుగు సీజన్లకు నాగ్ హోస్ట్ గా వ్యవహరించడంతో మొనాటినీ వచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే బిగ్ బాస్ షో సీజన్7కు హోస్ట్ గా వ్యవహరించడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
అన్ స్టాపబుల్ షో మంచి పేరు తెచ్చిపెట్టిన నేపథ్యంలో బాలయ్య రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరించడానికి ఓకే చెప్పారని అయితే తన షరతులకు కచ్చితంగా ఓకే చెబితే మాత్రమే బిగ్ బాస్ షోకు హోస్ట్ గా కొనసాగుతానని ఆయన చెప్పినట్టు బోగట్టా.
బిగ్ బాస్ షోకు హోస్ట్ గా కొనసాగడం నాగార్జునకు కూడా ఇష్టం లేకపోవడంతో బాలయ్యకు ఈ లక్కీ ఛాన్స్ దక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బిగ్ బాస్ షోకు హోస్ట్ గా పని చేసినా అదే సమయంలో అన్ స్టాపబుల్ షోకు కూడా హోస్ట్ గా కొనసాగుతానని బాలయ్య చెప్పినట్టు సమాచారం.
తాను హోస్ట్ గా వ్యవహరిస్తే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ వేయకూడదని కూడా బాలయ్య సూచించారని బోగట్టా.ఈ షరతులకు బిగ్ బాస్ నిర్వాహకులు అంగీకరించారని సమాచారం.
ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి బాలయ్యకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది.బాలయ్య బిగ్ బాస్ షోకు హోస్ట్ అయితే ఈ షో రేంజ్ మారిపోతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్ బాస్ షో సీజన్ 7 మొదలు కావడానికి మరో ఎనిమిది నెలల సమయం ఉంది.
బిగ్ బాస్ షో సీజన్6 కు రేటింగ్స్ తగ్గగా బాలయ్య ఎంట్రీతో ఈ షోకు రేటింగ్స్ మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







