విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై తీవ్రంగా మండిపడింది.
ఈ మేరకు అభ్యంతరాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం రేపు ఉదయం తిరిగి విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
క్షేత్రస్థాయి పరిశీలనకు తామే కమిటీని నియమిస్తామని వెల్లడించింది.