బాబా వంగా… ఈ పేరు ఏదో ఒక సందర్భంలో వినే వుంటారు.ముఖ్యంగా కరోనా సమయంలో వంగా పేరు బాగా వినబడింది.
కరోనా గురించి ఆమె ముందుగానే చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి.ఆమె బల్గేరియాకు చెందిన ఒక మహిళా ఫకీర్.1911 అక్టోబర్ 3న బల్గేరియాలోని కోజుహ్ పర్వతాల రూపైట్ ప్రాంతంలో జన్మించింది.ఆమె పుట్టినప్పుడు రెండు కళ్లలోనూ వెలుగు కనిపించినా 12 ఏళ్లకే రెండు కళ్లలోనూ వెలుగు పోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె పూర్తిగా అంధురాలు అయినప్పటికీ, ఆమె లోలోపల మాత్రం ప్రపంచాన్ని తెలుసుకోగల అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందట ఆమె ప్రత్యేకత.
ఆ ప్రత్యేకతే ఆమెని బాబాగా మలిచింది.
అక్కడి స్థానికులు ఆమెని దేవతలాగా కొలిచేవారు.మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఎలాగో ఎవరికి ఆమె అలాగన్నమాట.
ఇక ఆమె 1996 ఆగస్టు 11న మరణించినప్పటికీ 5079 సంవత్సరం వరకు ఏం జరగబోతోందో చెప్పగలిగిందట.అందుకే ఆమెని మహిమగల తల్లిగా అక్కడి ప్రజలు అభివర్ణిస్తారు.
ఈ క్రమంలో చాలా విషయాలు ఆమె అంచనాలకు తగ్గట్టుగా జరిగాయని ఓ నానుడి.బాబా వంగా అంచనా ప్రకారం 2023లో అణుశక్తి విస్ఫోటనం జరగనుందని చెప్పుకొచ్చింది.

తత్ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజలు, ధన నష్టం జరగనుందని సమాచారం.ఇక ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి బాబా వంగా ముందే చెప్పిందని అంటున్నారు.ఇది కాకుండా, ఒక పెద్ద దేశం జీవ ఆయుధాలతో ప్రజలపై దాడి చేయగలదని కూడా బాబా వంగా చెప్పారట.అలాగే బాబా వంగా అంచనా ప్రకారం, ఇతర గ్రహాల నుండి వచ్చే శక్తుల ద్వారా భూమిపై దాడి జరుగుతుంది.
దీని వల్ల ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతారని సమాచారం.కాగా ఇది గ్రహాంతరవాసుల దాడి కావచ్చునని ప్రజలు భావిస్తున్నారు.ఇక బాబా వంగా అంచనా ప్రకారం, 2023 సంవత్సరంలో ప్రమాదకరమైన తుఫాను రావచ్చు.కాబట్టి ప్రజలు ముందుగానే ఇలాంటివి ఊహించి తదనుగుణంగా బతకమని బాబా వంగా భక్తులు చెబుతున్నారు.







