ప్రముఖ నటి రోజాకు సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్నా ఆమె సన్నిహితులు మాత్రం రోజా మనస్సు చాలా మంచిదని ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఆమె కరిగిపోతారని చెబుతారు.వైసీపీ మంత్రి రోజాపై విమర్శలు కొత్త కాదు.
టీడీపీ నేతలు చాలా సందర్భాల్లో రోజాపై హద్దులు దాటి విమర్శలు చేయగా కొంతమంది వైసీపీ నేతలు సైతం రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో తరచూ వినిపిస్తోంది.
అయితే విమర్శల గురించి వీలైనంత వరకు ఎక్కువగా స్పందించడానికి రోజా ఇష్టపడరు.
అయితే రోజా సొంత అన్నయ్య ఒక సందర్భంలో రోజాపై అభిమానంతో ముద్దు పెట్టగా ఆ ఫోటో గురించి సోషల్ మీడియాలో నెగిటివిటీతో ట్రోల్స్ వచ్చాయి.ఆ ట్రోల్స్ గురించి రోజా స్పందిస్తూ నన్ను అమ్మానాన్నలా అన్నలు పెంచారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి అర్థం చేసుకోలేని వాళ్లపై విమర్శలు చేసినా వృథా అని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.

నేను కెరీర్ లో సక్సెస్ కావడం విషయంలో అన్నల పాత్ర ఎంతో ఉందని అన్నాచెల్లెళ్ల గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసేవాళ్లు మనుషులేనా అని రోజా ప్రశ్నించారు.టీడీపీ నేతలు రాజకీయ కారణాలతో నాపై ట్రోల్స్ చేస్తుండటం వల్ల నా పిల్లలు సైతం హర్ట్ అవుతున్నారని ఆమె పేర్కొన్నారు.ఈ తరహా ట్రోల్స్ చేయడం సరికాదని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి ట్రోల్స్ చేసే సంస్కృతి కరెక్ట్ కాదని ఆమె వెల్లడించారు.

ఈ తరహా ట్రోల్స్ వల్ల మనస్సులు విరిగిపోతున్నాయని రోజా అన్నారు.రోజా చెప్పింది నిజమేనని ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు.తనకు కొన్ని సందర్భాల్లో జరిగిన అవమానాల వల్ల నన్ను రాజకీయాలకు దూరం కావాలని కుటుంబం కోరిన సందర్భాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.రోజా ఆవేదన నేపథ్యంలో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేసేవాళ్లు ఇకనైనా మారతారేమో చూడాల్సి ఉంది.







