అందరూ అనుకున్నట్టు ఆలీ అల్లుడు డాక్టర్ కాదా... అసలు విషయం చెప్పిన అలీ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం కమెడియన్ గా హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఆలీ ప్రస్తుతం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.ఇక బుల్లితెరపై ప్రసారమవుతున్న అలీతో సరదాగా కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను తన షోకి ఆహ్వానించి వారిని ఎన్నో రకాలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు.

 Ali's Son-in-law Is Not A Doctor As Everyone Thought... Ali Told The Real Thing,-TeluguStop.com

ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఆయనే అతిథిగా రావడం యాంకర్ సుమ తనని ప్రశ్నించడం జరిగింది.

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారమైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా అలీ పలు విషయాల గురించి ముచ్చటించారు.ఈ క్రమంలోనే తాజాగా ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం జరిగిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మీ అల్లుడు బాగా సంపన్నుల అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కదా ఇందులో నిజం ఎంతుంది అలీ గారు అని సుమా ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సుమ సమాధానం చెబుతూ… మా అల్లుడు గారి కుటుంబం చాలా మంచి కుటుంబం.

వారి మంచితనం చూసి మేము అల్లుడుగా చేసుకున్నాం తప్ప ఆస్తుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని తెలిపారు.ఇక తన అల్లుడు అమెరికాలో రోబోటిక్ ఇంజనీర్ అని తెలిపారు.చాలామంది తను డాక్టర్ అని అనుకుంటున్నారు.నిజానికి తను ఇంజనీర్ అని తన నాన్న అన్నయ్య, వదిన, తన చెల్లెలు తన బావ డాక్టర్లు కానీ తన అల్లుడు ఇంజనీర్ అని అలీ ఈ షో ద్వారా తన అల్లుడి వృత్తి గురించి తెలియజేశారు.

ఇక నా శక్తి మేర నా కూతురికి కట్న కానుకలు ఇచ్చానని ఈ సందర్భంగా అలీ తన అల్లుడి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube