తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం క్రమక్రమంగా ముదురుతోంది.ఈ క్రమంలో తాజా పరిస్థితులు, పరిణామాలపై రంగంలోకి ప్రియాంక గాంధీ దిగారని సమాచారం.
కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ కు ఆమె ఫోన్ చేసి ఆరా తీశారు.ఈ మేరకు త్వరలోనే ఆమె సీనియర్ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
దీంతో రేపటి సీనియర్ నాయకుల భేటీ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల ప్రకటించిన కమిటీల నేపథ్యంలో టీ కాంగ్రెస్ లో సీనియర్ నేతల మధ్య, పీసీసీ చీఫ్ వర్గం మధ్య విభేదాలు చెలరేగిన విషయం తెలిసిందే.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు మండిపడుతున్నారు.







