గుంటూరు ప్రత్తిపాడులో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు వచ్చిన నందమూరి తారక రామారావు కొన్ని సంచలనమైన కామెంట్లు చేశారు.తారకరామారావు తాజాగా ఇచ్చిన ప్రసంగం తమ్ముళ్ళకి పెద్ద బూస్ట్ లా పనిచేస్తుంది.
క్రియాశీల రాజకీయాల్లోకి తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టిడిపి తరఫున తాను పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పాడు.
అసలైన విషయం ఏమిటంటే… జూనియర్ ఎన్టీఆర్ కూడా రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తాడని ఆయన చెప్పాడు.
ఈ విశయం విని ఎంతోమంది సంప్రమాశ్చర్యాలకు లోనయ్యారు.టిడిపి అభిమానులు ఎంతోమంది జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే బాగుంటుంది అని, అతను నాయకత్వం చేపట్టి పార్టీని నడిపించాలని ఆశగా ఉన్నారు.
అయితే ఎన్టీఆర్ ఇప్పటివరకు తనకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు.పైగా చేతిలో పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని నిత్యం షూటింగ్లకు వెళుతూ బిజీగా ఉన్నాడు.
అయితే ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం అనేది నిజంగా చాలా పెద్ద విషయమే.ఇక తారక రామ్ మాట్లాడుతూ… నందమూరి బాలకృష్ణ ప్రజల్లో ఉండి వారికి సేవ చేయడాన్ని అభినందించారు.
అలాగే వారి కుటుంబం మొత్తం బాలయ్య గారి అడుగుజాడల్లో నడుస్తారని ఆయన చెప్పడం జరిగింది.ఇక ఏపీ ప్రభుత్వంపై చాలా విరుచుకుపడుతూ ఇటువంటి దుష్ట పాలన తాను ఇప్పటివరకు చూడలేదని అన్నాడు.

మాచర్ల ఘటనపై మాట్లాడుతూ ఈ ఘటన వల్ల నష్టపోయిన వారికి, బాధపడిన వారందరికీ తను ఒకటే చెబుతున్నట్లు… త్వరలోనే రామన్న రాజ్యం (ఎన్టీఆర్ రాజ్యం) తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోకి తిరిగి తెస్తుందని అన్నాడు.ఇక అతని మామయ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నిక అవుతారని… అందుకు ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని చెప్పారు.ఇక ఈ మధ్యకాలంలో బాగా చప్పబడిపోయిన టిడిపి క్యాడర్ మొత్తం తారకరత్న మాటలు విని ఫుల్ జోష్ లోకి వచ్చేసారు.మరి నిజంగానే ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తే ఒక్కసారిగా లెక్కలు తిరగబడిపోవడం ఖాయం.







