భారత్ పై పాకిస్తాన్ మంత్రి ఫాజియా మారీ అక్కసు వెళ్లగక్కారు.తమ వద్ద అణుబాంబు ఉందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు.
అవసరమైతే దాన్ని ఉపయోగించడానికి వెనుకాడబోమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోదీ ప్రభుత్వం యుద్ధానికి దిగితే తాము సైతం ధీటుగా బదులిస్తామన్నారని సమాచారం.
ఎలా జవాబు ఇవ్వాలో పాకిస్థాన్ కు తెలుసన్న ఆమె… చెంపమీద కొడితే ఊరికే చూస్తూ ఉండిపోదని పేర్కొన్నారు.భారత ప్రధాని మోదీ దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు.
భారత్ ముస్లింలను ఉగ్రవాదంతో ముడివేస్తోందని విమర్శించారు.







