అధికారంలోకి రావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కొంగజపం చేస్తున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.జనసేనాని పవన్ ను నమ్ముకున్న బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.
టీడీపీ హయాంలో బడుగు, బలహీన వర్గాలకు ఏం చేశారో చెప్పాలన్నారు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు వలసలు వెళ్లారని వెల్లడించారు.
జగన్ సీఎం అయ్యాక వలస వెళ్లినవారంతా తిరిగివచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.ఎంతమంది కలిసి వచ్చిన జగన్ జైత్రయాత్రను అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.