యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఎంతో ప్రయత్నించిన బుచ్చిబాబు చివరకు రామ్ చరణ్ తో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.బుచ్చిబాబు కష్టాలు తీరినట్టేనని 2023 సంవత్సరం జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని కామెంట్లు వినిపించాయి.
బుచ్చిబాబు అభిమానులు సైతం ఈ ప్రాజెక్ట్ వేగంగానే పట్టాలెక్కుతుందని తెలిసి తెగ సంతోషించారు.
అయితే బుచ్చిబాబుకు మరో భారీ షాక్ తగిలిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
బుచ్చిబాబు డైరెక్షన్ లో నటించడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రామ్ చరణ్ నర్తన్ డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నర్తన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమానే చరణ్ మొదట మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.
చరణ్ ఆ విధంగా చేస్తే మాత్రం బుచ్చిబాబుకు భారీ షాక్ తగులుతుందని చెప్పవచ్చు.
మరోవైపు అధికారికంగా ప్రకటించకపోయినా చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని రాజమౌళి సైతం ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఆలస్యంగా మొదలవుతుందో లేదో తెలియాలంటే మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సిందే.రామ్ చరణ్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధపడుతున్నారు.బుచ్చిబాబు మాత్రం చరణ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీకి ఒక హిట్టిచ్చిన బుచ్చిబాబు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ అందిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.







