ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం సామాన్యులతో పాటు సెలబ్రెటీలో కూడా ఉండటంతో వాళ్ళు కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.ఒకప్పటి ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను బాగా ఆశ్చర్యపరుస్తున్నారు.
ముఖ్యంగా చిన్నప్పటి ఫోటోలు షేర్ చేస్తూ మాత్రం అందర్నీ మరింత ఆలోచించేలా చేస్తున్నారు.తాజాగా మరో హీరోయిన్ కూడా తన చిన్నప్పటి ఫొటోస్ షేర్ చేస్తూ అందర్నీ కన్ఫ్యూజన్ లో పెట్టింది.
ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ ఎవరు ఆ హీరోయిన్ అని తల పట్టుకుంటున్నారు.ఓసారి మీరు కూడా ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ చూసి గుర్తుపట్టగలరేమో చూడండి.
ఈ హీరోయిన్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన కూడా నటించింది.అంతేకాకుండా ఈ హీరోయిన్ తండ్రి కూడా ఇండస్ట్రీలో ఒకప్పుడు నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతే కాకుండా ఈ హీరోయిన్ మేనత్త కూడా తెలుగులో లేడీ కమెడియన్ గా చేసింది.
ఇంకా ఈ హీరోయిన్ ను గుర్తుపట్టలేదా.
ప్రస్తుతం కోలీవుడ్ లో మాత్రం ఆ రేంజ్ లో పరుగులు తీస్తుంది.అదేనండోయ్ ఆమె ఎవరో కాదు.
ఐశ్వర్య రాజేష్.అది తన చిన్ననాటి ఫోటో.
ఆమె ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సమయంలో తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటో అది.తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ ఐశ్వర్య రాజేష్.టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అతని భార్యగా సువర్ణ పాత్రలో మెప్పించింది.
ఇక ఈ సినిమా సక్సెస్ ను ఇవ్వకపోగా తన పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కెరీర్ మొదట్లో యాంకరింగ్ గా అడుగుపెట్టిన ఐశ్వర్య ఆ తర్వాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మొదట తమిళ సినిమాలతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.ఇక 2019లో మిస్ మ్యాచ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
హిందీ, మలయాళం సినిమాలలో కూడా నటించింది ఐశ్వర్య.

తమిళంలో స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.అంతవరకు మామూలు గుర్తింపుతో సాగిన తన కెరీర్.విజయ్ సేతుపతి నటించిన కె/పి రణ సింగం లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక ఈమె తండ్రి ఎవరో కాదు హీరో రాజేష్.ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు.కానీ చిన్న వయసులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడు.ఇక ఐశ్వర్య రాజేష్ మేనత్త ఎవరో కాదు కమెడియన్ శ్రీలక్ష్మి.
ఈమె కూడా తెలుగులో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా చేసి మంచి పేరు సంపాదించుకుంది.

అయితే తాజాగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా తన ఇంటర్ ఫస్టియర్ ఫోటో షేర్ చేసుకుంది.ఇక అందులో తను మధ్యలో కూర్చోగా.అప్పట్లో తను ఎలా ఉన్నానో.
ఆ ఫోటో ఎప్పటిదో చూడండి అంటూ తన ఫాలోవర్స్ కి షేర్ చేసుకుంది.అలా ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవుతుంది.







