ఉక్రెయిన్.రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం అనేక పరిణామాలకు దారితీస్తూ ఉంది.
యుద్ధం స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు కావస్తున్నా గాని ఎవరు వెనక్కి తగ్గటం లేదు.ఇప్పటికే ఉక్రెయిన్ లో చాలా నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి.
కొంతమంది సరిహద్దుల గుండా దేశం విడిచి పారిపోయారు.ఇలాంటి తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సలహాదారుడు అలెగ్జాండర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
రష్యా గెలిచే వరకు యుద్ధం ఆగదని అన్నారు.
రష్యా గెలిచాకే యుద్ధం ఆగుతుంది.లేదా ప్రపంచ వినాశనమే అని వైరల్ కామెంట్లు చేశారు.ఇది అదిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు.
ఏ దేశానికో లేదా పశ్చిమ దేశాలకి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం కాదు.అధిపత్యానికి వ్యతిరేకంగా రష్యా.
పోరాడుతుంది అని తెలిపారు.ప్రస్తుత పరిస్థితులు బట్టి ఇప్పుడప్పుడే యుద్ధం ముగిసే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.
అయితే రష్యా గెలవాలి.లేకపోతే ప్రపంచం నాశనం అవ్వాలి.
రెండిటిలో ఏదో ఒకటి జరిగితేనే యుద్ధం ఆగుతోంది అని అలెగ్జాండర్ డుగిన్ పేర్కొన్నారు.