పబ్లిసిటీ కోసం వరసగా పిచ్చి చేష్టలు చేస్తున్న కల్పిక.. చివరికి ఇలా కూడానా ?

కల్పిక గణేష్. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు.

 Actress Kalpika Ganesh Crazy Things For Publicity Details, Kalpika Ganesh, Dhany-TeluguStop.com

మీడియా తో పాటు సోషల్ మీడియా లో కూడా పాపులర్ గా కనిపిస్తుంది.అయితే ఎవరైనా సినిమా ఇండస్ట్రీ లో పాపులర్ అవ్వాలనే ప్రయత్నిస్తారు.

కానీ నటించిన సినిమాల కన్నా కూడా వివాదాల తో పాపులర్ అయితే భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయ్యే అవకాశం ఉంటుంది.ఇప్పుడు కల్పిక పరిస్థితి ఇంచు మించు అలాగే ఉంది.

అస్సలు ఇన్నేళ్ల కెరీర్ లో జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి తక్కువ అన్నట్టు గా ఉంది.చేసింది చాల తక్కువ సినిమాలు.

ఈ మధ్య యశోద చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకచ్చింది.ఆ ఒక్క పాత్ర వల్ల ఆమెకు జనాల్లో గుర్తింపు వచ్చింది కాబట్టి యశోద సినిమా ఆడియో ఫంక్షన్ నుంచి కల్పిక బాగా మాట్లాడం మొదలు పెట్టింది.

అయితే ఆమెకు గుర్తింపు వస్తే వచ్చే కిక్ ఏంటో బాగా అర్ధం అయినట్టు ఉంది.అందుకే ఆ గుర్తింపు ఎక్కువగా కోరుకుంటుంది.సమంతకు వచ్చిన వ్యాధి తనకు ఎప్పటి నుంచో ఉందని చెప్పి మొదటి బాంబ్ పేల్చింది.ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా బాగా ఆక్టివ్ గా మారింది.

అందరి గురించి మాట్లాడం కూడా మొదలు పెట్టింది.ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే పక్క వాళ్ళ లైఫ్ లో వేలు పెట్టి వాసన చూసే వరకు వచ్చింది.

ఈ మధ్య యూట్యూబ్ లో చాల వీడియోస్ వదులుతున్న కల్పిక భవిష్యత్తులో మరో శ్రీరెడ్డి లాగ తయారయ్యే అవకాశాలు లేకపోలేదు.

Telugu Actresskalpika, Kalpikadhanya, Kalpika Ganesh, Samantha, Yashoda-Movie

ఎందుకంటే ఆమె ప్రస్తుతం ధన్య బాలకృష్ణన్ అనే మరో నటితో పబ్లిక్ గానే గొడవకు దిగింది.ధన్య తెలుగు తో పాటు కోలీవుడ్ లోను పలు సినిమాల్లో నటిస్తుంది.అయితే ఆమె తమిళ్ డైరెక్టర్ ని రహస్యంగా పెళ్లి చేసుకుంది అనే విషయాన్నీ కల్పిక ఆమె పర్మిషన్ లేకుండా తన యూట్యూబ్ లో చెప్పడం వల్ల ఆమె ఆ వీడియో డిలీట్ చేయించింది అని తెలుస్తుంది.

ఆమె పెళ్లి విషయం కూడా వైరల్ గా మారింది.

Telugu Actresskalpika, Kalpikadhanya, Kalpika Ganesh, Samantha, Yashoda-Movie

మారి, మారి 2 సినిమాలు తీసిన దర్శకుడి తో ధన్య పెళ్లి జరిగిందని, అతడికి ఇంకా విడాకుల ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి బయటకు చెప్పట్లేదు అంటూ బాంబు పేల్చింది.ఇక వీడియో డిలీట్ చేసాక కల్పిక ఆవేశం తో ధన్య పై కామెంట్స్ చేస్తుంది.కోలీవుడ్ అగ్ర హీరో తో చెప్పించి వీడియో డిలీట్ చేయించావ్ నా పవర్ ఏంటో చూపిస్త అంటూ ధన్య కు కల్పిక ఓపెన్ ఛాలెంజ్ చేసింది.

అయితే ఆమె వ్యక్తి గత జీవితంలో దూరి మరి ఆమెను బయటకు లాగి పైగా ఆమెనే కోర్ట్ కి లాగుతా అంటున్న కల్పిక మాటలను అందరు కేవలం పబ్లిసిటీ స్టంట్ గా కొట్టి పారేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube