ప్రత్యేక పండుగలకు సినిమాలను రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనే సెంటిమెంట్ మన ఇండియన్ సినిమాల దగ్గర ఉంది.అందుకే ప్రతీ పండుగకు వరుసగా సినిమాలను రంగంలోకి దించేందుకు రెడీగా ఉంటారు.
ఇక సంక్రాంతి సీజన్ అంటే చెప్పాల్సిన పని లేదు.ఈ సీజన్ లో అంతా స్టార్ హీరోలు బరిలోకి దిగుతారు.
ప్రతి ఏడాది లాగానే వచ్చే ఏడాది 2023 సంక్రాంతి కూడా రసవత్తరమైన పోరు జరగనుంది.
మరి ఇప్పటికే ఈ బరిలో నాలుగు సినిమాలు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.
అందులో రెండు తెలుగు సినిమాలు కాగా.రెండు తమిళ్ సినిమాలు.
ఈ నాలుగు సినిమాల మధ్య పోటీ బాగానే ఉండబోతుంది.మరి ఈసారి రేస్ లో ఎవరు ఉన్నారో ఇప్పటికే అందరికి తెలుసు.
ఈసారి సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బరిలో దిగబోతున్నారు.
ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ దళపతి ‘వారసుడు’ సినిమాతో పాటు.
హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజిత్ కుమార్ ‘తునివు’ కూడా రిలీజ్ కాబోతుంది.వారసుడు సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.
ఈ రెండు సినిమాలకు ఇక్కడ పెద్దగా పోటీ లేకపోయినా కోలీవుడ్ లో మాత్రం నువ్వా నేనా అనే విధంగా పోటీ సాగబోతోంది.

అయితే ఈ రెండు సినిమాలపై దిల్ రాజు చేసిన కామెంట్స్ నిన్నటి నుండి వైరల్ అయ్యాయి.దిల్ రాజు విజయ్ సినిమాకు అదనంగా థియేటర్స్ అడగనున్నారని టాక్ వచ్చింది.అయితే ఈ రెండు సినిమాలకు సమానంగా థియేటర్స్ కల్పించారని.
కోలీవుడ్ లో ఇద్దరు హీరోలు సమానమే అని చెప్పేందుకు ఇది సంకేతం అని తెలిసేలా చేసారు.వారిసు, తునివు సినిమాలు సమానంగా రిలీజ్ అవుతున్నాయి.
చూడాలి ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారో.







