మీరు విన్నది నిజమే.ఇందులో ఆశ్చర్యపోడానికి ఏమీ లేదు.
అదో బెంజ్ కారు.అయితేనేమి.
అతగాడు ఒక తన్ను తన్నడంతో దానికి విముక్తి కలిగింది.ఇదేమి రామాయణంలో రాముడు, అహల్య వృత్తాంతం కాదండీ… ఈమధ్యనే నడిరోడ్డుమీద జరిగిన తంతు.
అదొక మెర్సిడెస్ బెంజ్ కారు.కానీ ఉన్నట్టుండి అది నడిరోడ్డుమీద ముందుకు కదల్లేక మొరాయించింది.
దీంతో కారు నడిపే ఎంత ట్రై చేసినా కదలనే కదలనంది.దాంతో అతను సాయం కోసం ఎదురు చూసాడు.
ఏ వాహనం అయినా అలా సడెన్ గా నడిరోడ్డుమీద ఆగిపోతే ఎలా? వెనకాల వచ్చే వాహనాలు కయ్ కయ్ మంటూ హారన్లు కొట్టేస్తుంటాయి కదా.అతగాడికి కూడా అదే అనుభవం ఎదురైంది.కానీ ఆ బెంజ్ కారు ఎంత ప్రయత్నించినప్పటికీ ముందుకు కదలకపోవడంతో కారు నడిపే వ్యక్తి పాపం ఏం చేయాలో తోచక అలా ఉండిపోయాడు.ఇంతలో ఓ ఆటోడ్రైవర్ సాయం తీసుకున్నాడు కారు ఓనర్.
తప్పని సరి పరిస్థితులలో ఆటో డ్రైవర్ ఆ బెంజ్ కారును కాలితో తన్నడంతో అది ముందుకు కదిలింది.

కాగా దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ ఆటో డ్రైవర్ తన ఆటోను నడుపుతూనే ఓ కాలితో బెంజ్ కారును షెడ్డుదాకా కాలితో తన్నిన వీడియో జనాలు తెగ చూస్తున్నారు.పూణెలోని కోరేగావ్ పార్క్ ఏరిలో బిజీగా ఉండే రోడ్డుపై ఈ సన్నివేశం రికార్డ్ అయ్యింది.
వైరల్ అవుతున్న వీడియోని చూసి నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.ఇదండీ మెర్సిడెస్ బెంజ్ కారు పరిస్థితి.ఎన్ని లక్షలు, కోట్ల రూపాయాలు పెట్టి కొన్నా ఒక్కోసారి ఇటువంటి పరిస్థితి తప్పదు అని ఒకరంటే బంగారు పళ్లానికైనా గోడ చెరుపు తప్పదు అని ఒకరు కామెంట్ చేసారు.ఈ తతంగాన్నంతా రోడ్డుపై వెళ్తున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అది కాస్తా వైరల్ అవుతోంది.







