హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరుగుతుంది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ భేటీకి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హాజరైయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలనాథులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
అదేవిధంగా హైదరాబాద్ లో బండి సంజయ్ పాదయాత్రపై రూట్ మ్యాప్ ను రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.







