డిసెంబర్.ఇది సంవత్సరంలో వచ్చే చివరి నెల.ఈ నెలలో వచ్చే పండుగ కోసం ప్రపంచంలోని దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి.ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అత్యంత వేడుకగా జరుపుకుంటారు.
యేసు జన్మదినం సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు.క్రిస్మస్ రోజున శాంతా క్లాజ్ తాత పిల్లలకు అనేక బహుమతులు తెస్తారు.
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.మెర్రీ క్రిస్మస్ అంటూ ఒకరికొకరు విరివిగా సందేశాలు పంపుకుంటారు.
ఇతర పండుగల మాదిరిగానే క్రిస్మస్ నాడు చాలామంది హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడానికి బదులు మేరీ క్రిస్మస్ అని అంటుంటారు.హ్యాపీ దీపావళి, హ్యాపీ న్యూ ఇయర్ లేదా హ్యాపీ ఈస్టర్ అని చెప్పుకుంటున్నప్పుడు క్రిస్మస్ రోజున మాత్రం హ్యాపీ క్రిస్మస్ ఎందుకు అనరని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఈ మేరీ అనే పదానికి అర్థం ఏమిటి? మెరీ క్రిస్మస్‌లో మేరీ అనే పదానికి అర్థమేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… మేరీ అంటే ఆనందంగా ఉండటం.మేరీ అనే పదం జర్మానిక్, ఓల్డ్ ఇంగ్లీషుతో రూపొందింది.

సాధారణ మాటలలో మేరీ అన్నా హ్యాపీ అన్నా ఒకటే అర్థం.కానీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి చాలామంది హ్యాపీకి బదులుగా మేరీ అనే పదాన్ని వాడతారు.ప్రముఖ అమెరికన్ రచయిత చార్లెస్ డికెన్స్ మేరీ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు.
అతను తన పుస్తకం ‘ఎ క్రిస్మస్ కరోల్’లో మేరీ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు అప్పటి నుంచి హ్యాపీకి బదులుగా మేరీ అనే పదం ప్రపంచం అంతటా వాడుకలోకి వచ్చింది.పూర్వం రోజుల్లో ప్రజలు హ్యాపీ క్రిస్మస్ అని మాత్రమే చెప్పేవారు.
ఇప్పటికీ హ్యాపీ క్రిస్మస్‌ను ఉపయోగించే అనేక దేశాలు ఉన్నాయి.ఇంగ్లండ్‌లో చాలా మంది మేరీకి బదులుగా హ్యాపీ క్రిస్మస్ అని చెబుతారు.
అయితే ఈ రెండు మాటలూ కరెక్టే.కానీ మేరీ అనే మాటే అంతటా అధికంగా ప్రచారంలో ఉంది.
మేరీ అనే పదం 16వ శతాబ్దంనుంచి వాడుకలోకి వచ్చింది.నాటి రోజుల్లో ఆంగ్ల భాష ప్రారంభ దశలో ఉంది.18వ, 19వ శతాబ్దాలలో ఆంగ్ల భాషకు ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పెరిగింది.క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపేందుకు హ్యాపీ కంటే మేరీనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
అయితే మేరీ అనే పదాన్ని క్రిస్మస్ తప్ప మరే పండుగలోనూ ఎవరూ ఉపయోగించక పోవడం విశేషం.








