జబర్దస్త్, అదిరింది షోల ద్వారా పాపులర్ అయిన కిర్రాక్ ఆర్పీ కొన్ని నెలల క్రితం జబర్దస్త్ షో గురించి చేసిన వివాదాస్పద కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.జబర్దస్త్ కమెడియన్లలో చాలామంది ఆర్పీ మాటలను తప్పుబట్టారు.
ఆ తర్వాత ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక రెస్టారెంట్ ను మొదలుపెట్టి అందరికీ షాకిచ్చారు.
ఆర్పీ రెస్టారెంట్ ను ఓపెన్ చేయడం ఏంటని కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేయడం గమనార్హం.
అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు 15 బ్రాంచ్ లు హైదరాబాద్ లో ఏర్పాటు కానున్నాయని చెబుతూ ఆర్పీ అందరికీ షాకిచ్చారు.తను సంపాదించిన డబ్బును ఆర్పీ ఈ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఆర్పీకి రోజుకు 2 లక్షల రూపాయల బిజినెస్ జరుగుతోంది.
నెలకు 60 నుంచి 70 లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుండగా ఆర్పీకి 20 లక్షల రూపాయల స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇతర రెస్టారెంట్లకు భిన్నంగా కట్టెల పొయ్యిపై చేపల పులుసును వండుతుండటంతో ఈ రెస్టారెంట్ కు ప్రజల నుంచి ఆదరణ అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కిర్రాక్ ఆర్పీ బిజినెస్ లో సక్సెస్ కావడంతో ఇతర జబర్దస్త్ కమెడియన్లు కూడా సంతోషిస్తున్నారు.అయితే ఈ రెస్టారెంట్ కోసం భారీ స్థాయిలోనే ఖర్చు అవుతోందని ఆర్పీ చెబుతున్నారు.క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడటం లేదని ఆర్పీ కామెంట్లు చేస్తున్నారు.
జబర్దస్త్ ఆర్పీకి సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.తను సెలబ్రిటీ కావడంతో తన వ్యాపారానికి భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.
ఆర్పీ మరింత సక్సెస్ కావాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.







