నేటి స్మార్ట్ యుగంలో ముఖ్యంగా చదువుతున్న, వుద్యోగం చేస్తున్న యువతకు ల్యాప్‌టాప్ అవసరం ఎంతైనా వుంది.కోవిడ్ తరువాత వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారికి వీటి అవసరం తప్పనిసరి అయింది.
అలాగే ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్లకి ల్యాప్‌టాప్ ప్రాముఖ్యత తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ ఏడాది మనదేశంలో చాలా ల్యాప్‌టాప్‌లు లాంచ్ అయ్యాయి.
అందులో బెస్ట్ ల్యాప్‌టాప్‌లు కూడా ఎన్నో ఉన్నాయి.వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం మనదేశంలో టాప్-10 ల్యాప్‌టాప్‌లు గురించి ఇపుడు తెలుసుకుందాము.
అలాగే ప్రస్తుతం ల్యాప్‌టాప్ కొనాలకున్నవారికి బెస్ట్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి.
ఈ లిస్టులో మొదటిది లెనోవో థింక్ ప్యాడ్ 15.దీని ధర రూ.33,990 అలాగే స్క్రీన్ సైజు 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ప్రాసెసర్ AMD రైజెన్ 3 5300U ప్రాసెసర్, ర్యామ్ 8 GB స్టోరేజ్ 256 GB SSD, ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11.ఇక రెండవది డెల్ 14 i5.దీని ధర రూ.68,450.స్క్రీన్ సైజు 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ప్రాసెసర్ ఇంటెల్ ఐ5 11వ తరం ప్రాసెసర్, ర్యామ్ 8 GB స్టోరేజ్ 512 GB SSD ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11.లిస్టులో మూడవది అసుస్ వివో బుక్ 15.దీని ధర రూ.23,990 స్క్రీన్ సైజు 15.6 అంగుళాల HD డిస్‌ప్లే ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11 హోం.

ఇక నాల్గవది యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం1 మ్యాక్స్.దీని ధర రూ.3,06,990.స్క్రీన్ సైజు 16.2 అంగుళాల డిస్‌ప్లే.ప్రాసెసర్ యాపిల్ ఎం1 మ్యాక్స్ ర్యామ్ 32 జీబీ.ఇక ఐదవది లెనోవో యోగా 9ఐ.దీని ధర రూ.1,67,673.స్క్రీన్ సైజు 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే.ఇందులో ఆరవది డెల్ న్యూ ఎక్స్‌పీఎస్ 13 ప్లస్.దీని ధర రూ.2,15,000.ప్రాసెసర్ ఇంటెల్ ఐ7 12వ తరం ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 11.ఇందులో ఏడవది యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2.దీని ధర రూ.1,39,390.ఎనిమిదవది ఏసర్ నిట్రో 5.దీని ధర రూ.1,04,990.తొమ్మిదవది లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3ఐ.దీని ధర రూ.79,990.ఇక ఈ లిస్టులో టాప్ టెన్ ఏసర్ స్విఫ్ట్ ఎక్స్ అని చెప్పుకోవచ్చు.దీని ధర రూ.99,999.పూర్తి వివరాలకు సంబంధిత సైట్స్ సంప్రదించగలరు.







