తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే 14 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 15వ వారం ముగింపు దశకు చేరుకుంటున్న విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు.
వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు టాప్ ఫైవ్ లోకి చేరుకోనున్నారు.ఇది ఎలా ఉంటే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఒక్కొక్కరికి హౌస్ లో వారి ప్రయాణం గొడవలు అలకలు ప్రతి ఒక్కటి ఫొటోస్ వీడియోస్ రూపంలో చూపిస్తూ వారికి సర్ప్రైజ్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లను సర్ప్రైజ్ చేసిన బిగ్ బాస్ తాజాగా కంటెస్టెంట్ శ్రీహాన్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు.అందరితోపాటుగా శ్రీహాన్ పై కూడా పొగడ్తల వర్షం కురిపించాడు బిగ్ బాస్.
ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇకపోతే ఆ ప్రోమోలో బిగ్ బాస్ శ్రీహాన్ గురించి మాట్లాడుతూ.
ఇంటిసభ్యుల కోసం నిలబడ్డ తీరు స్నేహానికి మీరిచ్చే విలువను బిగ్ బాస్ గుర్తించాడు.ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్ తన స్నేహితుల కోసం తగ్గారు అనడంతో శ్రీహాన్ తనని పొగుడుతున్న విధానం చూసి నూరేళ్లబెట్టి థాంక్యూ బిగ్ బాస్ మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడు అని అంటాడు.

ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే స్నేహితులతో పోటీపడి టికెట్ టు ఫినాలే నెగ్గారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మీరొక సేఫ్ ప్లేయర్ అనిపించినా మీ ఆటతో సమాధానం చెప్పారు.ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు బిగ్‌బాస్ విన్నారు.పట్టుకోవడంలోనే కాదు వదిలేయడంలో కూడా బలముంటుంది.మీ బలాన్ని, వినోదాన్ని, పట్టుదలను ఇలాగే కొనసాగించి అనుకున్నవన్నీ సాధించాలని బిగ్‌బాస్ కోరుకుంటున్నాడు అంటూ బిగ్‌బాస్ అతడిపై పొగడ్తల వర్షం కురిపించాడు.తన గురించి బిగ్‌బాస్ అంత గొప్పగా మాట్లాడేసరికి శ్రీహాన్‌కు కన్నీళ్లు ఆగలేదు.
థాంక్యూ సో మచ్ బిగ్ బాస్ నన్ను హౌస్ లో ఎవరు అర్థం చేసుకున్న చేసుకోకపోయినా మీ నాన్న బాగా చాలా అర్థం చేసుకున్నారు మీరు అందించిన గిఫ్టులు కూడా ప్రతి ఒక్కటి బాగున్నాయి అంటూ శ్రీ హాన్ అయ్యాడు.







