2022 ఏడాది పూర్తి కాబోతుంది.మరొక 15 రోజులు అయితే ఈ ఏడాది పూర్తి అయ్యి కొత్త ఏడాది రాబోతుంది.
మరి 2022 లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి.బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సినిమాలు కూడా ఎన్నో వచ్చి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టే రికార్డులను క్రియేట్ చేసారు.
మరి ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాయి.
అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను తుడిచి పెట్టేందుకు హాలీవుడ్ రంగంలోకి దిగింది.
ఈ ఏడాదికి ఫైనల్ టచ్ గా హాలీవుడ్ మూవీ అవతార్ 2 గ్రాండ్ గా లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా రిలీజ్ కాకుండానే మన సినిమాలు పాన్ ఇండియా వ్యాప్తంగా క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్స్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ఈ ఏడాది మన ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా కేజిఎఫ్ 2.
ఈ సినిమా మీద ఉన్న రికార్డును కూడా ఇప్పుడు అవతార్ 2 క్రాస్ చేసింది.యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సినిమా కేజీఎఫ్ 2.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ చేసారు.కేజిఎఫ్ 2 భారీ క్రేజ్ అందుకోవడంతో ఈ సినిమా రిలీజ్ కాకుండానే మల్టీ ప్లెక్స్ బుకింగ్స్ లలో అప్పుడు రికార్డ్ క్రియేట్ చేసింది.
![]()
ఇక ఇప్పుడు ఈ రికార్డ్ నూయి అవతార్ 2 బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఇండియాలో ఏకంగా 4 లక్షల 40 వేళకి పైగా టికెట్స్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయట.కేజిఎఫ్ సినిమా 4 లక్షల 11 వేలకి బుకింగ్ జరుపుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ ను సైతం మాయం చేసేసింది.ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.






