కర్నూలులో పోలీసులపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.జిల్లాలో హర్యానాకు చెందిన ఓ ముఠా ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతోంది.
ఈ నేపథ్యంలోనే రాత్రి సమయంలో గస్తీకి వచ్చిన ఎస్సైకి అనుమానం రావడంతో కొందరు వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించారు.దీంతో అప్రమత్తమైన దుండగులు కంటైనర్ లో పరార్ కాగా ఎస్సై వారిని వెంబడించారు.
తదనకపల్లె వద్ద కంటైనర్ ను వదిలి దుండగులు పారిపోయారు.వీరిలో ఇద్దరిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే దుండగులు పోలీసులపై కాల్పులు జరిపినట్లు సమాచారం.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మిగిలిన వారికోసం విస్తృతంగా గాలిస్తున్నారు.







