బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతోమంది స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు.ఈ విధంగా బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.
జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడం తిరిగి ఈ కార్యక్రమానికి రావడం అనేది జరుగుతూ ఉంది.ఇలా ఇప్పటికే ఎంతోమంది ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోయి రీ ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో తమ కామెడీ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ చమక్ చంద్ర సైతం ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన విషయం మనకు తెలిసిందే.
అయితే నాగబాబు వెళ్లిపోవడంతో ఆయన బాటలోనే చమ్మక్ చంద్ర కూడా బయటకు వెళ్లిపోయారు.
జబర్దస్త్ వీడిన కొంతకాలం పాటు ఇతర చానల్స్ లో సందడి చేసిన చంద్ర ప్రస్తుతం ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు.దీంతో ఈయన ఈటీవీలో స్పెషల్ ఈవెంట్లలో సందడి చేశారు.
అయితే త్వరలోనే చమ్మక్ చంద్ర కూడా తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది.ఇప్పటికే మల్లెమాలవారు చంద్రతో కలిసి సంప్రదింపులు జరిపారని త్వరలోనే ఈయన ఎంట్రీ ఉండబోతుందని సమాచారం.

చమ్మక్ చంద్ర ద్వారా జబర్దస్త్ కు పరిచయమైనటువంటి మొట్టమొదటి లేడీ కంటెస్టెంట్ శ్రీ సత్య కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.అయితే చంద్ర వెళ్ళిపోవడంతో జబర్దస్త్ నుంచి శ్రీ సత్య కూడా వెళ్లిపోయింది.అయితే గత రెండు వారాల నుంచి శ్రీ సత్య తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తోంది.ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర కూడా ఈ కార్యక్రమంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ కార్యక్రమంలోకి చంద్ర రీ ఎంట్రీ ఇవ్వడంతో మరోసారి ప్రేక్షకులకు ఎక్స్ట్రా ఫన్ ఉంటుందని చెప్పాలి.







