పేరుకే పెద్ద నిర్మాణ సంస్థలు. కానీ చెప్పేవి మాత్రం కాకి లెక్కలు.
వాస్తవానికి సినిమా నిర్మిస్తున్నారంటేనే ఒక తప్పుడు లెక్కల దందా అని చెప్పక తప్పదు.పూర్తిగా అకౌంట్స్ కి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఉండదు.
అస్సలు ఎవరికి ఎలాంటి రెమ్యునరేషన్ ఇస్తున్నారో బయటకు చెప్పరు.అలాగే అకౌంట్స్ లోను చూపించరు.
ఐటి, జీఎస్టీ పైన తప్పుడు లెక్కలు షరా మాములే.అందుకోసం ఉన్నతాధికారులను ఎరా వేసి వారికి నచ్చినట్టుగా చేయించుకొని జీఎస్టీ నుంచి బయటపడుతూ ఉంటారు.
CSR ఫండ్ అనే పదం ఉంటుంది అని కూడా వారికి తెలిసే అవకాశం లేదు.ఉదాహరణకు మైత్రి మూవీ మేకర్స్ నే తీసుకుందాం.
వీరి సంస్థ పైన ప్రస్తుతం జీఎస్టీ కి చెందిన దాడులు జరుగుతున్నాయి.ఎందుకు అంటే వీరి చేతిలోనే ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలు ఉన్నాయ్.పైగా ఇక కాలంలో 9 సినిమాలు నిర్మిస్తూ 2000 కోట్ల రూపాయల మార్ట్ క్రియేట్ చేసారు.అయితే ఈ ఒక్క సంస్థ మాత్రమే ఇలాంటి తప్పుడు లెక్కల దందా చేస్తుందా అంటే కాదు.
అన్ని ప్రధాన నిర్మాణ సామర్థాలు ఒకే రకంగా ఉన్నాయ్.

ఏ హీరో కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే లెక్కలు పూర్తిగా తప్పుడు లెక్కలు గా ఉంటున్నాయి అనేది ఈ దాడులు చేస్తున్న శాఖల వారి ఆరోపణ.ఇక ఏ సంస్థ మీద అయినా దాడి జరిగింది అంటే ఖచ్చితంగా దాని వెనక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉంటుంది.అయితే ఇప్పుడు చిరంజీవి నుంచి అల్లు అల్లు అర్జున్ మెగా ఫామిలీ మొత్తం బిజెపి కి సపోర్ట్ గానే ఉన్నాయ్.
అయినా ఎందుకు ఒక నిర్మాణ సంస్థ నే టార్గెట్ చేస్తుంది.

సో ఇది రాజకీయ ఎత్తుగడ కాదు.కేవలం వ్యాపార లావాదేవీల ఇస్యూ అని చెప్పచు.అయితే ఈ దాడులు ఇప్పుడు ఏం కొత్త కాదు.
ఇంతకు ముందు చాల సార్లు జరిగినవే.ఎక్కడ కూడా ఈ దాడుల అనంతరం సదరు నిర్మాణ సంస్థలకు శిక్షలు వేయించడం లేదా ఫైన్ కట్టించడం కానీ చేయవు.
ఆలోపే ఆడిటర్లు అంత సెట్ చేసేస్తారు.పోనీ ఇలాంటి దాడుల వలన అయినా స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఎంతో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అంటే అది కూడా సాధ్యపడటం లేదు.







