బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉన్నాయి.ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా స్టార్ సెలబ్రెటీ హోదా అందుకున్న వారిలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఒకరు.
శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో లో పార్టిసిపేట్ చేస్తూ చివరికి ఇదే కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరికీ కొరియోగ్రఫీ చేస్తూ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ అనంతరం ఈ కార్యక్రమం నుంచి దూరమయ్యారు.
ఇలా మల్లెమాల కార్యక్రమం నుంచి దూరమైన శేఖర్ మాస్టర్ తిరిగి స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేశారు.అలాగే ఆహాలో ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ కార్యక్రమంలో కూడా ఈయన సందడి చేస్తున్నారు.
దీంతో మల్లెమాలవారికి శేఖర్ మాస్టర్ కి మధ్య గొడవలు తలెత్తాయని అందుకే ఈ కార్యక్రమానికి దూరమయ్యారని వార్తలు వచ్చాయి అయితే ఈ విషయాలపై శేఖర్ మాస్టర్ కూడా స్పందించారు.కొన్ని కారణాల వల్ల తాను బయటకు వచ్చానని అయితే త్వరలోనే రీఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చారు.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా బాస్ ఇస్ బ్యాక్ అంటూ గ్రాండ్ గా శేఖర్ మాస్టర్ రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా శేఖర్ మాస్టర్ రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు కూడా ఎంత సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ….ఏదో మాకు బయట కమిట్మెంట్ ఉంటే వెళ్లి వస్తాము కానీ మాకు మాత్రం ఈ కన్నతల్లి ఢీ షోనే అంటూ ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి విడుదలైనటువంటి ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







