ఏపీ మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం జగన్ మంత్రులతో సమావేశం అయ్యారు.ఈ మేరకు మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
లబ్ధిదారులకు పథకాల పంపిణీతో నేరుగా పాల్గొనాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.మంత్రులు ఇంఛార్జ్ లుగా ఉన్న జిల్లాల్లోనూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు.
నేతల మధ్య గొడవలు ఉంటే ఇంఛార్జ్ మంత్రులు పరిష్కరించాలని వెల్లడించారు.ఈ మేరకు మంత్రులు పూర్తి పారదర్శకంగా ఉండాలని సూచించారు.