డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ మధ్య కాలం లో ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు.
అయితే దర్శకుడుగా ఆయన ను ఇప్పటికీ కూడా లక్షలాది మంది అభిమానిస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.ఆయన సినిమా లకు అభిమానులు ఎలా అయితే ఉంటారో ఆయన మ్యూజింగ్స్ కి కూడా అలాగే అభిమానులు ఉంటారు అనడంలో సందేహం లేదు.
ఎన్నో జీవిత సత్యాలను తన పాడ్ కాస్ట్ ద్వారా తెలియజేస్తూ యూట్యూబ్ లో సంచలనంగా మారిన పూరి జగన్నాథ్ మరో సారి తన మ్యూజింగ్స్ తో సిద్ధమయ్యాడు.ఈ సారి తాలింపు అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో జనాల ముందుకు రాబోతున్నాడు.

యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా ఈ వీడియోస్ ఉండబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.పూరి జగన్నాథ్ ని అభిమానించే వారు ఎంతో మంది ఈ వీడియోల కోసం ఎదురు చూస్తున్నారు.ఇక పై వారికి పండగే అనడంలో సందేహం లేదు.ఆయన మంచి మాటలు వినడం తో పాటు అప్పుడప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటే వాటిని వింటూ నవ్వుకోవడం ఇంకా బాగుంటుంది అంటూ ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు.
ఇక నుండి రెగ్యులర్ గా క్యూ కటినట్లుగా పూరి మ్యూజింగ్స్ రాబోతున్నాయి.పూరి జగన్నాథ్ తాజాగా లైగర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా ఒక అద్భుతం అన్నట్లుగా ఉంటుందని వందల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుందని అంత భావించారు.కానీ అనుకున్నది ఒక్కటి అయినది మరోటి అన్నట్లుగా అత్యంత దారుణమైన కలెక్షన్స్ నమోదవడం తో నిర్మాత గా కూడా పూరి జగన్నాథ్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
కనుక ఇప్పుడు ప్రశాంతత కోసం ఈ మ్యూజింగ్స్ ని మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.గతం లో పూరి నుండి వచ్చిన మ్యూజింగ్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
కనుక ఈసారి కూడా అంతకు మించి అన్నట్లుగా ఉంటాయని చాలా మంది నమ్మకం గా ఉన్నారు.







