అబ్బా ఏం సెప్తివి జక్కన్న..ఇంత జ్ఞానోదయం ఎలా అయ్యింది అంటావ్

రావి చెట్టు కింద కూర్చోకముందే మన జక్కన్నకు జ్ఞానోదయం అయ్యింది.సినిమా అంటే వందల కోట్ల గ్రాఫిక్స్, నెల విడిచి సాము చేసే హీరోలు, అక్కర లేని హీరోయిజం, కంటెంట్ ఉన్న లేకున్నా విపరీతమైన ప్రచారం చేసి సినిమా హైప్ పెంచి డిస్ట్రిబ్యూటర్స్ నెత్తిన రుద్దడం వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ తో కాకుండా కాంతారా సినిమా చూసి నేర్చుకోవాలట.

 Rajamouli About Movie Budget And Other Things Details, Jakkanna, Rajamouli, Kant-TeluguStop.com

ఏళ్లకు ఏళ్ళు సినిమా తీయకుండా, బడ్జెట్ పెంచకుండా చేస్తేనే సినిమా అట.

అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని భ్రష్టు పట్టించింది రాజమౌళి.చరిత్రకు మసి పూసి మారేడు కాయ చేయడం, ఎక్కడో ఒక సినిమా సీన్స్ ని కాపీ కొట్టడం.మానవేతర శక్తిగా హీరోను మార్చేయడం వంటివి కాకుండా అయన సినిమా పట్ల పెంచుతున్న వ్యాపారం గురించి మాట్లాడితే ఏళ్లకు ఏళ్ళు సినిమా తీసి, భిన్నమైన రీతిలో ప్రచారాలు చేసి, చిన్న చిన్న గ్రాఫిక్స్ కోసం లొందన్, అమెరికా వంటి దేశాల నుంచి నిపుణులను రప్పించడం, ఇలా వందల కోట్ల దందాకు తెరలేపడం.

రాజమౌళి చక్కగా సినిమా తీస్తాడు కానీ అంతకుమించి సినిమా వ్యాపారం చేస్తాడు.

Telugu Acharya, Rajamouli, Jakkanna, Kantara, Karthikeya, Rishab Shetty, Small-M

ఇక్కడ సినిమా తీసి ఖండాలు దాటించి వీలైనంత డబ్బులు వసూల్ చేయించి ఫ్యామిలీ ప్యాకేజీలతో నిర్మాతలను ముప్పతిప్పలు పెడతారు.సినిమా లో ఉండాల్సింది కంటెంట్ మాత్రమే, వందల కోట్ల గ్రాఫిక్స్ కాదు.అలాగే ఉండాల్సింది మంచి నటన తెలిసిన హీరో.

కేవలం హీరోయిజం కోసం వాడుకునే నటుడు కాదు.ఆలా ఇద్దరు స్టార్స్ తో తీసిన ఆచార్య ఏమైంది.

చిన్న హీరో, మంచి కంటెంట్ తో కార్తికేయ సీక్వెల్ చేసారు.అది చాలదా, మరి ఇంకా ఏం కావలి.

Telugu Acharya, Rajamouli, Jakkanna, Kantara, Karthikeya, Rishab Shetty, Small-M

సరే ఇప్పటి వరకు ఏం జరిగిన ఇకనైనా హీరోలు ఆకాశంలో ఉన్న హీరోలు నెలకి దిగాలి, 100 కోట్లల్లో ఉన్న సినిమాల ఖర్చు తగ్గాలి.కేవలం నాణ్యతతో ఉన్న క్రియేటివిటీ కి పట్టం కట్టాలి.రిస్క్ లేని సినిమా తీయాలి.ఇప్పటికే ఒకరిని మించి మరొకరు బడ్జెట్ పెంచుతూ సినిమా వ్యయాన్ని పెంచుతూ అది చూసే వారి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి కాబట్టి అందరి పైన ఒత్తిడి పెంచడం.

ఇదంతా ఆపాలి.ఇక్కడ సినిమాను బ్రతికించండి.సామాన్యుడికి సినిమాను దూరం చేయద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube