మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.సరిగ్గా నెల రోజులకు అంటే జనవరి 13వ తారీఖున సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే.
భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా లో మెగా స్టార్ చిరంజీవి తో పాటు మాస్ మహారాజా రవి తేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.మొదట రవితేజ పాత్ర గురించి చాలా తక్కువగా మాట్లాడుకున్నాం.
గెస్ట్ రోల్ అనే ప్రచారం జరిగింది, కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఫుల్ లెన్త్ రోల్ ను ఆయన చేస్తున్నాడని తెలుస్తుంది.అందుకే సినిమా లోని ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేయడం తో పాటు ఆయన పాత్ర కు సంబంధించిన విజువల్స్ ని కూడా విడుదల చేయడం జరిగింది.

వాల్తేరు వీరయ్య సినిమా లో కచ్చితం గా మాస్ మహా రాజా రవితేజ పాత్ర ఆకట్టుకుంటుందని, సినిమా స్థాయిని డబల్ చేస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వబోతున్న నేపథ్యం లో రవి తేజ ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికం ఎంత అనే ఆసక్తికర ప్రచారం జరుగుతుంది.సాధారణం గా రవితేజ తన సినిమా లకు 10 నుండి 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటాడట.అందుకే ఈ సినిమా కోసం అందులో దాదాపుగా సగం అంటే ఆరున్నర కోట్ల రూపాయలను ఆయన అందుకున్నాడని తెలుస్తోంది.
దర్శకుడు ఆయన పాత్ర పై కాస్త వెయిట్ ఎక్కువగానే పెట్టాడట.అందుకే ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ని రవి తేజ డిమాండ్ చేశాడు అంటూ ప్రచారం జరుగుతుంది.
సంక్రాంతి కి విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా లో రవితేజ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తాడు అనేది చూడాలి.







