అవకాశాలు లేక అలాంటి వేషాలు వేస్తున్న ఆదా శర్మ.. నెటిజన్స్ ఏం అన్నారంటే?

టాలీవుడ్, బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఆదా శర్మ.ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ.హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచింది.ఈ సినిమాలో తన నటనతో బాగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

 Adah Sharma Pretending To Have No Opportunities What Did The Netizens Say , Adah-TeluguStop.com

తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ, భాషల్లో కూడా తన నటన ను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ.2008లో హారర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమకు పరిచయం అయింది.ఈ సినిమాతో తన నటన వల్ల ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.

ఆ తర్వాత 2014లో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తొలిసారిగా పరిచయం అయింది.

ఇక ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకున్న కూడా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది ఈ బ్యూటీ.

కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా తన పాత్ర అంతగా సక్సెస్ కాలేకపోయింది.ఇక అక్కడి నుండి మళ్లీ బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

ఇక ఆదాశర్మ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇక బుల్లితెరపై కూడా పలు వాణిజ్య పరమైన ప్రకటనలు కూడా చేసింది.

ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది తన డాన్స్ వీడియో లతో బాగా సందడి చేస్తుంది.ప్రస్తుతం ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.ఇక తన హాట్ హాట్ అందాలతో ఫోటో షూట్ చేయించుకుంటూ వాటిని బాగా షేర్ చేసుకుంటుంది.నిత్యం ట్రెండీని ఫాలో అవుతూ ఉంటుంది.

ఇక తన అందాలతో కుర్రాళ్లను తన వైపు మలుపుకుంటుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో కాకుండా ఇతర భాషలో బాగా బిజీగా ఉంది ఆదాశర్మ.

అక్కడ బాగానే అవకాశాలు అందుకుంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక వీడియో షేర్ చేసుకుంది.

అయితే ఆ వీడియోలో తను కాస్త భయంకరంగానే కనిపించింది.నిజానికి చెప్పాలంటే అదేదో హారర్ కి సంబంధించిన వీడియో లాగా ఉంది.

అందులో తన గెటప్, తన ఎక్స్ప్రెషన్స్ మాత్రం భయం పుట్టించేలా ఉన్నాయి.పైగా మధ్యలో తన ఫేస్ కూడా దెయ్యంలా మారడంతో ఏదో తేడాగా అనిపించింది.అయితే ఇది తన సినిమాకు సంబంధించిందేమో అన్నట్లుగా అనిపించింది.ఇక ఆ వీడియో షేర్ చేసుకోగా ఆ వీడియోని చూసిన నెటిజన్స్ అచ్చం దెయ్యంలాగా ఉన్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక మరి కొంతమంది అవకాశాలు లేకపోయేసరికి.ఇటువంటి వేషాలు కూడా వేస్తున్నావా అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube