నా కోరికలను గుండెల్లోనే దాచుకొని ఒంటరిగా వెళ్తున్నా.. ఏంటి దివి పాప ప్రేమలో పడ్డావా?

బిగ్ బాస్ షో ద్వారా అందరి కంటిలో పడిన బ్యూటీ దివి.అలా అప్పటినుంచి ఈ బ్యూటీ ఏదో ఒక విధంగా తన పరిచయాన్ని పెంచుకుంటూ వచ్చింది.అలా వెండితెరపై అవకాశాలు కూడా అందుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా మంచి అభిమానం సంపాదించుకుంది.తొలిసారిగా ఈ బ్యూటీ వెండితెరపై పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించగా ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకుంది.అలా హౌస్ లో ఉన్నంతకాలం తన గేమ్ తో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.

 I Hide My Desires In My Heart And Go Alone What Kind Of God Did You Fall In Love-TeluguStop.com

ఇక ఈ షోతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

బిగ్ బాస్ తర్వాత అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.

పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.

Telugu Biggboss, Chiranjeevi, Devi, Godfather, Heart, Tollywood, Fall Love-Movie

గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు అవకాశాలు అందుకోవడం లేదు.చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో అవకాశం అందుకోగా ఈ సినిమాలో తన పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది.మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.

అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిస్తూ తన అందంతో మతి పోగొట్టేసింది.సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా.

అప్పుడప్పుడు అభిమానులతో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.

Telugu Biggboss, Chiranjeevi, Devi, Godfather, Heart, Tollywood, Fall Love-Movie

వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.తన డాన్స్ వీడియోలతో, ఫన్నీ రీల్స్ తో బాగాహడావుడి చేస్తుంది.ఇక తన ఫోటోలను, తన ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది.

నిజానికి ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ తర్వాత వరుస హిట్లతో బాగా దూసుకెళ్లింది.ఇక ఇప్పుడు కాస్త అవకాశాలు అందుకోకపోవటంతో సోషల్ మీడియాలోనే గడుపుతుంది.అయితే అప్పుడప్పుడు లవ్ కొటేషన్స్ పెడుతూ అందరి దృష్టిలో పడుతుంది.దీంతో ఈమె లవ్ లో ఉందని అందరూ అనుకున్నారు.

కానీ ఏ రోజు కూడా దివి ఈ విషయంలో మాత్రం బయటపడలేదు.అయితే తాజాగా తన ఇన్ స్టా లో ఒక ఫోటో పంచుకుంది.

ఆ ఫోటోలో తను కార్లో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.అయితే ఆ ఫోటో షేర్ చేస్తూ ఒక మరో కొటేషన్ షేర్ చేసుకుంది.

అందులో.నీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని నా కోరికలన్నీ గుండెల్లో దాచుకొని ఒంటరిగా ఈ ప్రయాణం చేస్తున్న అంటూ షేర్ చేసుకోగా దీంతో అందరికీ మళ్లీ అనుమానం మొదలైంది.

వెంటనే ఏంటి దివి పాప ప్రేమలో పడ్డావా ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube