జీవితంలో సగం గొడవలకు అదే కారణం... పూరి కామెంట్స్ వైరల్!

డేరింగ్ అండ్ డాషన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన దర్శకత్వంలో తాజాగా లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Director Puri Jagannath About Philosophy In Puri Musings Details, Director Puri-TeluguStop.com

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి సినిమాలకు దూరంగా ఉన్నారు .లేకపోతే పూరి ఒక వైపు సినిమాలు చేస్తూనే పూరి మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో ఫిలాసఫీలను చెబుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఈయన తన మ్యూ జింగ్స్ ద్వారా మరో ఫిలాసఫీ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా మన జీవితంలో సగం గొడవలు తడ్కా ద్వారానే జరుగుతాయని చెప్పుకొచ్చారు.

ఇక్కడ తడ్కా అంటే తాలింపు అని అర్థం వస్తుందని పూరి తెలిపారు.మనం ఒక వ్యక్తిని ఒక మరొక వ్యక్తి దగ్గరకు పంపిస్తే ఆయన నుంచి రాగానే ఆ వ్యక్తి ఏమన్నారనే విషయం వదిలిపెట్టి తన గురించి లేనిపోని మాటలు మనకు తెలియజేస్తూ ఉంటారు.

ఇలా తన గురించి లేనిపోనివన్నీ మనకు చెప్పాల్సిన తరువాత మనలో వారి గురించి ఒక అభిప్రాయాన్ని కలిగించి అనంతరం నిజం చెబుతారు.ఇలా పెనం మీద వేసినది తీసుకు రమ్మంటే మధ్యలో ఎన్నో తాలింపులు జోడించి మన వద్దకు అసలు విషయాన్ని తీసుకువస్తారు.

అసలు విషయం చెప్పకుండా తమ అభిప్రాయాన్ని చెప్పి.

Telugu Puri Jagannath, Problems, Liger, Philosophy, Purijagannath, Puri-Movie

అవతలి వాళ్లను విలన్స్ చేసేస్తాడు.తను ఎలా ఆలోచిస్తాడో.మనల్ని కూడా నెట్టేసి మన మనసు మొత్తంపాడు చేస్తున్నారు అందుకే మధ్యవర్తులు నిజం చెబుతున్నారా వారి అభిప్రాయాన్ని చెబుతున్నారా అనే విషయాన్ని గ్రహించాలి.

నువ్వు అనుకున్నది చెబుతున్నావా ? అని అడిగేయాలి.ఆ మధ్యవర్తులు మరెవరో కాదు.

మనమే.మనం జరిగినది అనుకున్నది మాత్రమే చెప్పాలి.

ఆ తర్వాత అడిగితేనే మీ ఓపినియన్ చెప్పాలి.ప్రపంచంలో ప్రతిరోజు గొడవలు జరగడం సగం జీవితాలు నాశనం కావడం కేవలం తడ్కా వల్ల మాత్రమే జరుగుతున్నాయని ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మరో ఫిలాసఫీని తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube